
గత రెండేళ్ల విరామం తరువాత పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ వరుసగా సినిమాల్ని లైన్‌లో పెడుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం బాలీవుడ్ బ్లాక్ బస్టర్ `పింక్` ఆధారంగా రూపొందుతున్న `వకీల్‌సాబ్`లో నటిస్తున్న విషయం తెలిసిందే. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ షూటింగ్ ఇటీవలే పునః ప్రారంభమైంది.
పవన్ నవంబర్ నుంచి సెట్‌లోకి ఎంటర్ కాబోతున్నాడు. ఇదిలా వుంటే ఈ మూవీ అండర్ ప్రొడక్షన్‌లో వుండగానే పవన్ మరో రీమేక్ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. మలయాళంలో పృథ్విరాజ్ సుకుమారన్, బీజు మీనన్ కలిసి నటించిన చిత్రం `అయ్యప్పనుమ్ కోషియుమ్`. అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకున్నఈ మూవీ రీమేక్‌లో పవన్ పవర్‌ఫుల్ పోలీస్ అఫీసర్‌గా కనిపించబోతున్నారు.
మరో పాత్రలో రానా నటిస్తాడని వార్తలు వినిపించాయి. కానీ తాజా సమాచారం ప్రకారం పృథ్విరాజ్ సుకుమారన్ పాత్రలో పవన్ హార్డ్‌కోర్ ఫ్యాన్ నితిన్ నటించే అవకాశం వుందని ఫిల్మ్ నగర్ టాక్. `అప్పట్లో ఒకడుండేవాడు` ఫేమ్ సాగర్ చంద్ర దర్శకత్వం వహించనున్న ఈ చిత్రంలో పవన్‌కు జోడీగా సాయి పల్లవి నటించనుందని తెలిసింది. ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మించబోతోంది.