
శేఖర్ కమ్ముల సినిమాలు ఎప్పుడూ కూడా లో నుండి మీడియం బడ్జెట్ వరకే ఉంటాయి. ఎప్పుడూ కూడా మితిమీరిన బడ్జెట్ తో శేఖర్ కమ్ముల సినిమా నిర్మించింది లేదు. కానీ కెరీర్ లో తొలిసారి కమ్ముల భారీ బడ్జెట్ సినిమాను ట్రై చేస్తున్నాడు. తమిళ స్టార్ హీరో ధనుష్ తో శేఖర్ కమ్ముల సినిమా చేయడం అనేది చాలా మందికి ఆశ్చర్యకరమైన వార్తే.
ఎవరూ ఊహించని కాంబినేషన్ ఇది. ఏషియన్ గ్రూప్ ఈ సినిమాను నిర్మిస్తోంది. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రానికి భారీ బడ్జెట్ ను కేటాయించారట. ఏకంగా 120 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించనున్నారు అన్నది టాక్. ఇందులో ఏకంగా 50 కోట్ల రూపాయలు ధనుష్ కే వెళ్ళిపోతాయట.
ధనుష్ కు ఇప్పుడు హాలీవుడ్ లో కూడా మార్కెట్ ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ది గ్రే మ్యాన్ సినిమాలో నటిస్తున్నాడు ధనుష్. ఒకవేళ అది క్లిక్ అయితే శేఖర్ కమ్ముల సినిమాకు ప్లస్ అవుతుంది. దానికి తోడు తమిళ, తెలుగు, హిందీ భాషల్లో విడుదల కానుంది ఈ సినిమా.