
తమిళ చిత్ర పరిశ్రమలో ధనుష్ స్టార్ హీరోగా వెలుగొందుతున్నారు.. సూపర్ స్టార్ రజినీకాంత్ అల్లుడు అయినా తన మామ పేరు అడ్డుపెట్టుకోకుండా స్వతహాగా తన ఓన్ టాలెంట్ తో సినిమాలను చేస్తూ.. ప్రేక్షకుల్లోనూ, అబ్భిమానుల్లోనూ తనకంటూ సపరేట్ స్టైల్ ని ఏర్పరచుకొని సక్సెస్ ఫుల్ గా ముందుకు దూసుకెళ్తున్నారు ధనుష్. నటుడిగా, నిర్మాతగా, సింగర్ గా, దర్శకుడిగా బహుముఖ ప్రగ్య కలిగిన ధనుష్ వరుస విజయాలతో అభిమానులను అలరిస్తున్నారు.
ధనుష్ నటించిన తమిళ్ చిత్రాలు తెలుగులోనూ డబ్ అయి సక్సెస్ అయ్యాయి. ఈ మేరకు ధనుష్ నటిస్తోన్న మరో చిత్రం తెలుగులో తూటా గా రాబోతుంది. స్టైలిష్ డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో గొలుగూరి రామకృష్ణ రెడ్డి సమర్పణలో విజయ భేరి పతాకంపై జి.తాతారెడ్డి జి.సత్యనారాయణరెడ్డి సంయుక్తంగా తూటా చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ధనుష్ సరసన మేఘా ఆకాష్ హీరోయిన్ గా నటిస్తోంది. షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ చిత్రం డబ్బింగ్ కార్యక్రమాలను జరుపుకుంటోంది. గౌతమ్ వాసుదేవ్ మీనన్- ధనుష్ కాంబినేషన్ లో వస్తోన్న తొలి చిత్రం ఇది. ఈ చిత్రం పోస్టర్ ను తిలిసారిగా ఈరోజు విడుదల చేసారు.. ధనుష్, మేఘా ఆకాష్ హగ్ చేసుకున్న ఈ పోస్టర్ చాలా ఇంట్రెస్టింగ్ గా కనిపిస్తుంది. యూత్ ఆడియెన్స్ కి బాగా కనెక్ట్ అయ్యే మూవీలా అనిపిస్తోంది.. తెలుగు తమిళ్ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రం త్వరలోనే విడుదలకు సిద్ధం అవుతోంది..!!