Homeటాప్ స్టోరీస్ధనుష్ రెండో తెలుగు సినిమానూ ఓకే చేసినట్లేనా?

ధనుష్ రెండో తెలుగు సినిమానూ ఓకే చేసినట్లేనా?

ధనుష్ రెండో తెలుగు సినిమానూ ఓకే చేసినట్లేనా?
ధనుష్ రెండో తెలుగు సినిమానూ ఓకే చేసినట్లేనా?

తమిళ స్టార్ హీరో ధనుష్ తెలుగు సినిమాలపైన ఆసక్తి చూపిస్తున్నాడు. ఇప్పటికే సెన్సిబుల్ చిత్రాల దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఒక సినిమాను ఓకే చేసిన విషయం తెల్సిందే. ఏషియన్ సునీల్ నిర్మిస్తోన్న ఈ సినిమాను తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు. ధనుష్ తన కమిట్మెంట్స్ అన్నీ పూర్తి చేసిన తర్వాత ఈ చిత్రాన్ని టేకప్ చేయనున్నాడు.

ఇదిలా ఉంటే ధనుష్ మరో తెలుగు చిత్రాన్ని ఓకే చేసినట్లు తెలుస్తోంది. రొమాంటిక్ ఎంటర్టైనెర్స్ తో తనకంటూ పేరు తెచ్చుకున్న దర్శకుడు వెంకీ అట్లూరి చెప్పిన కథకు ధనుష్ ఇంప్రెస్ అయ్యాడట. ఈ నేపథ్యంలో శేఖర్ కమ్ముల చిత్రం కంటే ముందే వెంకీ అట్లూరి దర్శకత్వంలో చిత్రం చేయడానికి ధనుష్ ఓకే చెప్పినట్లు తెలుస్తోంది.

- Advertisement -

తెలుగు మరియు తమిళ భాషల్లో ఈ చిత్రం తెరకెక్కనుంది. ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ భారీ ఖర్చుతో నిర్మించనుంది. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని విశేషాలు త్వరలోనే తెలుస్తాయి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All