
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం అక్టోబర్ 2న విడుదలయ్యే సైరా నరసింహారెడ్డి ప్రమోషన్స్ లో యమ బిజీగా ఉన్నాడు. దీని తర్వాత చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నాడన్న విషయం తెల్సిందే. నవంబర్ నుండి ఈ చిత్ర షూటింగ్ మొదలుకానుంది. ఇందులో చిరు ద్విపాత్రాభినయం చేస్తున్నాడని, కాజల్ హీరోయిన్ గా నటిస్తుందని సమాచారం.
మొదటినుండి కొరటాల శివ సినిమాలకు దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడిగా పనిచేసాడు. చేసిన నాలుగు సినిమాలు సంగీత పరంగా సూపర్ హిట్స్ గా నిలిచాయి. కానీ ప్రస్తుతం దేవి ఫామ్ అంతగా బాలేని కారణంగా కొరటాల శివ బాలీవుడ్ సంగీత దర్శకుల వైపు చూస్తున్నాడని, దేవితో పనిచేయట్లేదని వార్తలు వచ్చాయి.
అయితే అవన్నీ ఒట్టి రూమర్సేనని తేలిపోయింది. కొరటాల శివ – చిరు సినిమాకి దేవినే సంగీత దర్శకుడిగా పనిచేయనున్నాడు. ప్రస్తుత ఫామ్ ఎలా ఉన్నా తన సినిమాలకు బెస్ట్ ఔట్పుట్ ఇస్తున్నాడు కాబట్టి కొరటాల శివ సంగీత దర్శకుడ్ని మార్చే ఆలోచన విరమించుకున్నట్లు తెలుస్తోంది.