Homeటాప్ స్టోరీస్బుట్ట‌బొమ్మ ‌క్రికెట‌ర్ ఫ్యామిలీ స్టెప్పులు!

బుట్ట‌బొమ్మ ‌క్రికెట‌ర్ ఫ్యామిలీ స్టెప్పులు!

బుట్ట‌బొమ్మ ‌క్రికెట‌ర్ ఫ్యామిలీ స్టెప్పులు!
బుట్ట‌బొమ్మ ‌క్రికెట‌ర్ ఫ్యామిలీ స్టెప్పులు!

హాలీవుడ్ పాప్ గీతాల‌కు మ‌న వాళ్లు స్టెప్పులు వేయ‌డం చూశాం. ఇంకా చూస్తూనే వున్నాం. కానీ ప్ర‌స్తుతం సీన్ మారింది. ఇప్పుడు మ‌న పాట‌కు వాళ్లు స్టెప్పులేయ‌డం మొద‌లైంది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ న‌టించిన చిత్రం `అల వైకుంఠ‌పుర‌ములో`. మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ తెర‌కెక్కించారు. రిలీజ్‌కి ముందే భారీ అంచ‌నాల్ని పాట‌ల‌తో క్రియేట్ చేసిన ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద భారీ విజ‌యాన్ని సాధించింది.

అల్లు అర్జున్ కెరీర్‌లో ఇండ‌స్ట్రీ హిట్‌గా నిలిచిన ఈ చిత్రంలోని పాట‌లు యూట్యూబ్‌లో రికార్డు  సృష్టిస్తున్నాయి. సిరివెన్నెల సీతారామ‌శాస్త్రి రాసిన `సామ‌జ వ‌ర‌గ‌మ‌న‌..` 100 మిలియ‌న్ వ్యూస్‌ని దాటితే యువ గేయ ర‌చ‌యిత కాస‌ర్త‌శ్యామ్ రాసిన `రాములో రాములా…` కూడా అదే ఫీట్‌ని రిపీట్ చేసింది. ఈ రెండు పాట‌ల త‌రువాత ఇదే చిత్రం నుంచి రామ‌జోగ‌య్య‌శాస్త్రి రాసిన ‌`బుట్ట‌బొమ్మ బుట్ట బొమ్మ …` గీతం కూడా 100 మిలియ‌న్ వ్యూస్ దాటి రికార్డుని సొంతం చేసుకుంది.

- Advertisement -

ఈ పాట‌లోని స్టెప్స్‌ని అనుక‌రిస్తూ చాలా మంది బాలీవుడ్ తార‌లు వీడియోలు చేశారు. తాజాగా ఇదే పాట‌లోని స్టెప్స్ వేస్తే క్రికెట‌ర్ ఆస్ట్రేలియా ఓపెన‌ర్ డేవిడ్ వార్న‌ర్ త‌న భార్య కాండీస్‌తో క‌లిసి బుట్ట బొమ్మ స్టెప్స్ వేయ‌డం ఆక‌ట్టుకుంటోంది. టిక్ టాక్ కోసం చేసిన ఈ వీడియో సోష‌ల్ మీడియా ఇన్‌స్టా ద్వారా డేవిద్ వార్న‌ర్ అభిమానుల‌తో పంచుకున్నారు.

 

View this post on Instagram

 

It’s tiktok time #buttabomma get out of your comfort zone people lol @candywarner1

A post shared by David Warner (@davidwarner31) on

Credit: Instagram

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All