Homeటాప్ స్టోరీస్పుష్ప కోసం స్పెషల్ కేర్ తీసుకుంటున్న బన్నీ

పుష్ప కోసం స్పెషల్ కేర్ తీసుకుంటున్న బన్నీ

పుష్ప కోసం స్పెషల్ కేర్ తీసుకుంటున్న బన్నీ
పుష్ప కోసం స్పెషల్ కేర్ తీసుకుంటున్న బన్నీ

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అల వైకుంఠపురములో చిత్రంతో సూపర్ డూపర్ హిట్ ను కొట్టిన విషయం తెల్సిందే. తన కెరీర్ లోనే బెస్ట్ హిట్ గానే కాకుండా ఆల్ టైమ్ నాన్ బాహుబలి సక్సెస్ ను అందుకున్నాడు. ఈ సినిమాతో తన రేంజ్ మరింత పెరిగిందనే చెప్పాలి. ఇక ఇప్పుడు సుకుమార్ దర్శకత్వంలో పుష్ప చేయడానికి ఉత్సాహంగా ఉన్నాడు. అసలైతే ఈ సినిమా షూటింగ్ ఈపాటికి మొదలైపోయి శరవేగంగా జరుగుతూ ఉండాలి. కానీ కరోనా కారణంగా లాక్ డౌన్ అవ్వడంతో షూటింగ్ మొదలవ్వలేదు. తెలంగాణ ప్రభుత్వం షూటింగ్ లకు అనుమతులిచ్చింది కానీ అవి ఇప్పటికే మొదలైపోయిన షూటింగ్ ల వరకే. సో పుష్ప టీమ్ ఇంకా వెయిట్ చేయాల్సి వస్తోంది. ఆగస్ట్ నుండి షూటింగ్ లు మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి.

ఇక ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా సుకుమార్ ఆస్థాన సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ ఎంపికైన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఫామ్ పరంగా దేవి కొంచెం వెనుకపడ్డాడనే చెప్పాలి. అందుకే తనను తాను ప్రూవ్ చేసుకోవడానికి దేవి ఈ చిత్రం కోసం చాలా కసిగా పనిచేస్తున్నాడని సమాచారం. ప్రస్తుతం లాక్ డౌన్ కావడంతో దేవి మరింత జాగ్రత్తగా ఈ సినిమా కోసం పనిచేస్తున్నాడని, ఎలాగైనా తన కెరీర్ బెస్ట్ ఆల్బమ్ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాడని తెలుస్తోంది. సాధారణంగానే సుకుమార్ సినిమా అంటే దేవి మనసు పెట్టి చేస్తాడు ఇక ఈ సినిమాకు మరింత జాగ్రత్తగా వర్క్ చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే రెండు పాటలకు వర్క్ పూర్తి చేసాడని, ఔట్పుట్ అదిరిపోయిందని అంటున్నారు. చూడాలి మరి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All