Homeగాసిప్స్ఇదే నిదర్శనం కొరటాల - దేవి బ్రేకప్

ఇదే నిదర్శనం కొరటాల – దేవి బ్రేకప్

ఇదే నిదర్శనం కొరటాల - దేవి బ్రేకప్
ఇదే నిదర్శనం కొరటాల – దేవి బ్రేకప్

దర్శకుడిగా కొరటాల శివ చేసినవి నాలుగు సినిమాలు. ఈ నాలుగు చిత్రాల్లో కామన్ గా పనిచేసిన వ్యక్తి దేవిశ్రీ ప్రసాద్. మిర్చి, శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, భరత్ అనే నేను చిత్రాల్లో దేవి మ్యూజిక్ ప్రధానంగా హైలైట్ అయింది. సాంగ్స్ తో పాటు సినిమాల్లో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో కూడా దేవి మెప్పించాడు. అయితే గత కొన్ని రోజులుగా కొరటాల శివ తర్వాతి చిత్రంలో దేవిశ్రీ ప్రసాద్ బదులు వేరే సంగీత దర్శకుడు పని చేస్తాడని ప్రచారం జరిగింది.

ప్రచారం ఎంత జోరుగా జరిగినా దేవితో కొరటాల శివకు ఉన్న సాన్నిహిత్యం కారణంగా దాన్ని ఎవరూ నమ్మలేదు. అయితే ఈరోజుతో దానికి ఫుల్ క్లారిటీ వచ్చేసింది. ఈరోజు చిరంజీవి, కొరటాల శివ సినిమా ఓపెనింగ్ జరిగింది. రామ్ చరణ్ నిర్మాతగా ఈ చిత్రం తెరకెక్కనుంది. పూజ కార్యక్రమంలో సినిమాటోగ్రాఫర్, ప్రొడక్షన్ డిజైనర్, పాటల రచయిత ఇలా అందరూ ప్రత్యక్షమయ్యారు కానీ దేవి మాత్రం కనపడలేదు.

- Advertisement -

అంతే కాకుండా మీడియాకు ఇచ్చిన ప్రెస్ నోట్ లో కూడా ఎక్కడా దేవి పేరు లేదు. సంగీత దర్శకుడి పేరు వెల్లడించలేదు. దీంతో అందరికీ క్లారిటీ ఇచ్చేసినట్లైంది. నిజానికి దేవి మ్యూజిక్ లో క్వాలిటీ ఈ మధ్య బాగా తగ్గింది. పాటల విషయంలో దేవి ఎన్నడూ లేని స్థాయిలో విమర్శలు ఎదుర్కొంటున్నాడు. దీంతోనే కొరటాల శివ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All