Homeగాసిప్స్పుష్ప ఆల్బమ్ పై స్పెషల్ అప్డేట్ ఇదే!

పుష్ప ఆల్బమ్ పై స్పెషల్ అప్డేట్ ఇదే!

పుష్ప ఆల్బమ్ పై స్పెషల్ అప్డేట్ ఇదే!
పుష్ప ఆల్బమ్ పై స్పెషల్ అప్డేట్ ఇదే!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించనున్న తాజా చిత్రం పుష్ప. ఈ సినిమా షూటింగ్ మార్చ్ లోనే మొదలుకావాలి కానీ కరోనా నేపథ్యంలో షూటింగ్ మొదలుపెట్టడం సాధ్యపడలేదు. సుకుమార్ ఈ చిత్రానికి దర్శకుడన్న విషయం తెల్సిందే. ఆర్య, ఆర్య 2 తర్వాత అల్లు అర్జున్, సుకుమార్ కలిసి చేస్తున్న సినిమా ఇది. అల వైకుంఠపురములో వంటి భారీ విజయం తర్వాత బన్నీ, రంగస్థలం వంటి బ్లాక్ బస్టర్ తర్వాత సుకుమార్ చేస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీ రేంజ్ లో ఉన్నాయి.

పుష్ప చిత్రంలో అల్లు అర్జున్ ఎర్ర చందనం స్మగ్లింగ్ చేసే లారీ డ్రైవర్ గా కనిపిస్తాడని తెలుస్తోంది. చిత్తూర్ జిల్లా నేపథ్యంలో పుష్ప సాగుతుంది. దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. రీసెంట్ దేవి అంత ఫామ్ లో లేడు. దానికంటే థమన్ అద్భుతమైన ట్యూన్స్ తో దేవిను వెనక్కి నెట్టాడు అని చెప్పుకోవడం కరెక్టేమో.

- Advertisement -

అయితే దేవి శ్రీ ప్రసాద్ తనను తాను తిరిగి నిరూపించుకోవడానికి పుష్ప సినిమాపైనే ఫోకస్ పెట్టాడట. తన కెరీర్ లోనే అత్యద్భుతమైన ట్యూన్స్ ను ఈ సినిమా కోసం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. తాజాగా పుష్ప సినిమా ఆల్బమ్ కు ట్యూన్స్ ను ఫైనల్ చేసేసాడట దేవి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All