
రాక్ స్టార్ దేవి శ్రీ ఫై హైదరాబాద్ గోషా మహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ ఆగ్రహం వ్యక్తం చేసారు..తెలంగాణ ప్రజలకు క్షేమపణలు చెప్పకపోతే చెప్పులతో కొడతారంటూ హెచ్చరించారు. ఇంతకీ ఏంజరిగిందటే..ఈ మధ్య దేవి శ్రీ టైం ఏమాత్రం బాగాలేదు. ఈయనకు ఛాన్సులు తగ్గడమే కాదు..చేసిన సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద ప్లాప్ అవుతున్నాయి. ఈ తరుణంలో ఆడవాళ్లు మీకు జోహార్ల ఫై గట్టి ఆశలే పెట్టుకున్నాడు. కిషోర్ తిరుమల డైరెక్షన్లో శర్వానంద్ , రష్మిక జంటగా దేవి శ్రీ మ్యూజిక్ అందించిన ఈ మూవీ ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. రీసెంట్ గా విడుదలైన ఈ చిత్రంలోని పాటలు శ్రోతలను బాగానే ఆకట్టుకుంటున్నాయి. కాగా చిత్ర ప్రమోషన్ లో భాగంగా ఏర్పటు చేసిన ప్రీ రిలీజ్ వేడుకలో దేవి శ్రీ మాట్లాడిన తీరుపట్ల హిందూ సంఘాలు తప్పుపడుతున్నాయి.
డైరెక్టర్ తిరుమల కిషోర్‌కు ఎక్కువ దేవుడి మీద భక్తితో మాలలు వేసుకునే అలవాటు ఉంది. దేవుడిపై భక్తితో వేసుకునే మాలలకు, అమ్మాయిలకు ముడిపెడుతూ దేవిశ్రీ ప్రసాద్ మాట్లాడటం అనేది ఇప్పుడు వివాదాస్పదం అయ్యింది. మీరేమో స్వామి మాల, మురుగన్ మాల అని వెళుతుంటారు. మేమేమో సీత, గీత అని వెళుతుంటాము అని ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో దేవిశ్రీ ప్రసాద్.. కిషోర్ తిరుమలను ఉద్దేశించి అన్నారు. హిందువులు ఎంతో పవిత్రంగా, భక్తితో వేసుకునే మాలలు విషయంలో దేవి శ్రీ ఆలా మాట్లాడడం పట్ల హిందూ సంఘాలు తప్పుపడుతున్నారు. ఇది వరకే ఇలాంటి వ్యాఖ్యలు చేసినందుకు గోషా మహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ దేవిశ్రీకి వార్నింగ్ ఇచ్చాడు. ఇప్పుడు మరోసారి ఆయన దేవిశ్రీ ప్రసాద్ మాటలను తప్పు పట్టారు. ఈ సందర్భంగా రాజా సింగ్ మాట్లాడుతూ తన తప్పును దేవిశ్రీ ప్రసాద్ తెలుసుకుని క్షమాపణలు చెప్పాలని, లేకుంటే తెంగాణ ప్రజలు చెప్పులతో కొడతారని వార్నింగ్ ఇచ్చాడు. మరి ఈ వివాదం ఫై దేవి శ్రీ ఎలా స్పందిస్తారో చూడాలి.