
ఇండస్ట్రీలో ఒకరి పైడియాని మరొకరు కొట్టేయడం చాలా ఏళ్లుగా జరుగుతూనే వుంది. హాలీవుడ్ కథల్ని ఫ్రీమేక్‌లుగా తీర్చిదిద్దిన వాళ్లూ వున్నారు. బాలీవుడ్ కథల్ని తెలుగు నేటివిటీకి అనుగునంగా మార్చి ఫ్రమేక్‌లు చేసిన దిగ్దర్శకులూ వున్నారు. తాజాగా ఇలాంటి కథా చౌర్యమే మరోటి జరిగిందని ఓ దర్శకుడు ఆరోపిస్తున్నారు. ఆయనే దేవా కట్టా.
సమైక్య ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు, వై.ఎస్. రాజశేఖర్‌రెడ్డి రాజకీయంగా బద్ద శత్రువులుగా వుండేవారు. అయితే ఈ ఇద్దరు రాజకీయాల్లోకి రాకముందు మంచి స్నేహితులన్న విషయం చాలా మందికి తెలియదు. భిన్నమైన మనస్థత్వాలు గత ఈ ఇద్దరు నేతలు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ తరువాత చంద్రబాబు నాయుడు తెలుగు దేశం పార్టీలోకి వెళ్లిపోయారు. ముఖ్యమంత్రి అయ్యారు.
వై.ఎస్. రాజశేఖరరెడ్డి కాంగ్రెస్‌లోనే వుండి ఆయనా యుఖ్య మంత్రి పీఠం ఎక్కారు. ఆ తరువాత ఇద్దరి మధ్య అదే స్నేహ బంధం కొనసాగిందా? లేదా? ఎవరెలా ప్రవర్తించారు? ఇద్దరి మధ్య ఎలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి అన్నది ఆసక్తికరం. ఇదే అంశాన్ని ప్రధాన కథాంశంగా తీసుకుని దేవా కట్టా 2017లో ఓ స్క్రిప్ట్‌ని సిద్ధం చేసి మూడు ఎపిసోడ్‌ల కోసం ప్రిపేర్ చేశాడట. దాన్ని ఓ వ్యక్తి దొంగిలించి డిజాస్టర్ వెబ్ సిరీస్‌ని రూపొందించాడని, మళ్లీ అదే వ్యక్తి తాజాగా చంద్రబాబు, వైఎస్ రాజశేఖర్‌రెడ్డిల కథని కూడా లేపేశాడని అయితే ఈ సారి అతన్ని వదిలే ప్రసక్తిలేది దర్శకుడు దేవా కట్టా
ట్విట్ఱర్ వేదికగా వెల్లడించడం ఆసక్తికరంగా మారింది. ఇదే స్టోరీ లైన్‌తో `చదరంగం` ఫేమ్ చక్రి ఓ వెబ్ సిరీస్‌కు ప్లాన్ చేస్తున్న విషయం తెలిసిందే.