
దర్శకుడిగా దేవా కట్టాకు ఇండస్ట్రీలో చాలా గౌరవముంది. వెన్నెల, ప్రస్థానం, ఆటోనగర్ సూర్య వంటి హార్డ్ హిట్టింగ్ సినిమాలతో తన రైటింగ్ పవర్ ను చూపించిన దేవా కట్టా, రీసెంట్ గా కొన్ని బ్యాడ్ సినిమాలు చేసి లో ఫేజ్ లో ఉన్నాడు. అయితే దేవా కట్టా కొంత గ్యాప్ తీసుకుని చేసిన రిపబ్లిక్ కు భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. సినిమా సంగతి అటుంచితే దేవా రైటింగ్ పవర్ కు అందరూ ఫిదా అవుతున్నారు.
సెన్సిబుల్ దర్శకుడికి ఎట్టకేలకు హిట్ దొరికింది అని సంతోషించినవాళ్ళే ఎక్కువ. ఇదిలా ఉంటే రిపబ్లిక్ సక్సెస్ ను ఎంజాయ్ చేసిన దేవా కట్టా ఇప్పుడు తన నెక్స్ట్ సినిమాపై ఫోకస్ చేసాడట. ఈసారి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను దృష్టిలో పెట్టుకుని స్క్రిప్ట్ ను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. సాధారణంగా దేవా కట్టా సినిమా సినిమాకూ భారీ గ్యాప్ తీసుకుంటాడు. కానీ ఈసారి అలా జరగకూడదు అనే ఉద్దేశంతో ఈ ఏడాదే తన నెక్స్ట్ చిత్రాన్ని లాంచ్ చేయాలని భావిస్తున్నాడు.
అయితే పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరస సినిమాలతో బిజీగా ఉన్నాడు. భీమ్లా నాయక్, హరిహర వీరమల్లు షూటింగ్ దశల్లో ఉన్నాయి. వీటి తర్వాత హరీష్ శంకర్ దర్శకత్వంలో భవదీయుడు భగత్ సింగ్, సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మరో సినిమా చేయాల్సి ఉంది. ఇవన్నీ చేసిన తర్వాతే ఈ సినిమా పట్టాలెక్కుతుంది. మరి ఇంత బిజీలో పవన్ కళ్యాణ్ దేవా కట్టాకు అవకాశం ఇస్తాడా?