Homeటాప్ స్టోరీస్క్లైమాక్స్  పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల్లో `దేశ‌ముదుర్స్`

క్లైమాక్స్  పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల్లో `దేశ‌ముదుర్స్`

క్లైమాక్స్  పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల్లో `దేశ‌ముదుర్స్`పోసాని కృష్ణముర‌ళి, పృథ్వీ రాజ్, అర్జున్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తోన్న చిత్రం `దేశ‌ముదుర్స్`.  `ఇద్ద‌రూ 420 గాళ్ళే` అనేది ఉప శీర్షిక‌. ఎం.కె.ఫిల్మ్స్ ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై క‌న్మ‌ణి ద‌ర్శ‌క‌త్వంలో కుమార్ నిర్మిస్తున్నారు. పులిగుండ్ల స‌తీష్ కుమార్, వ‌ద్దినేని మాల్య‌ద్రి నాయుడు స‌మ‌ర్ప‌కులు. ఈ సినిమా వివ‌రాల‌ను యూనిట్ సోమ‌వారం సాయంత్రం హైద‌రాబాద్ లో ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో వెల్ల‌డించారు.
ఈ సంద‌ర్భంగా చిత్ర ద‌ర్శ‌కుడు మాట్లాడుతూ, ` పోసాని, పృథ్వీగారు ఫుల్ లెంగ్త్ కామెడీ పాత్ర‌ల్లో క‌నిపిస్తే ఎలా ఉంటుంద‌నే ఆలోచ‌న‌తో పుట్టిన సినిమా ఇది.  వాళ్లిద్ద‌రి తెర‌పై కాసేపు క‌నిపిస్తేనే?  నవ్వుకుంటాం. అలాంటి న‌టులు సినిమా అంతా న‌వ్విస్తే ఇంకేస్తాయిలో న‌వ్వులు పువ్వులు పుస్తాయో చెప్పాల్సిన ప‌నిలేదు. ఇద్ద‌రి పాత్ర‌ల్లో ఎండిగ్ టైమ్ లో వ‌చ్చే పెర్పామెన్స్ బాగుంటుంది.  క‌థ‌కు హార‌ర్ ట‌చ్ కూడా ఇచ్చాం. అర్జున్ మంచి  పెర్పామ‌ర్. ఆ పాత్ర‌లో స‌న్నివేశాలు క‌న్నీరు పెట్టిస్తాయి.  షూటింగ్  పూర్త‌యింది. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు చివ‌రి ద‌శ‌లో ఉన్నాయి. మే లో సినిమా విడుద‌ల చేస్తాం` అని అన్నారు.
నిర్మాత కుమార్ మాట్లాడుతూ, `ద‌ర్శ‌కులు మంచి అవుట్ ఫుట్ తీసుకొచ్చారు. ప్ర‌తీ స‌న్నివేశం ప్రేక్ష‌కుల‌ను న‌వ్విస్తుంది. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు చివ‌రి ద‌శ‌లో ఉన్నాయి. మిగతా ప‌నులు కూడా పూర్తిచేసి మే రెండ‌వ వారంలో  గానీ, మూడ‌వ వారంలోగానీ సినిమా విడుద‌ల చేస్తా. ప్రేక్ష‌కులంతా మా చిత్రాన్ని ఆద‌రిస్తార‌ని కోరుకుంటున్నా` అని అన్నారు.
సంగీత ద‌ర్శ‌కుడు యాజ‌మాన్య మాట్లాడుతూ, ` నాకీ బ్యాన‌ర్లో తొలి సినిమా ఇది. పాట‌లు బాగా వ‌చ్చాయి. చ‌క్క‌ని కామెడీ ఎంట‌ర్ టైన‌ర్. అంద‌రికీ న‌చ్చుతుంది` అని అన్నారు.
మాట‌ల ర‌చ‌యిత భ‌వానీ ప్ర‌సాద్ మాట్లాడుతూ, ` క‌డుపుబ్బా న‌వ్వించే కామెడీ ఎంట‌ర్ టైన‌ర్ ఇది. ఐపీఎల్ మ్యాచ్ ల్లో కొహ్లీ-ధోనీ క‌లిసి ఆడితే ఎలాంటి కిక్కుంటుందో?  పోసాని, పృథ్వీ క‌లిసి న‌టిస్తే అలాంటి కిక్ ఈ సినిమా ద్వారా ప్రేక్ష‌కుల‌కు దొరుకుతుంది. ఇందులో ఇద్ద‌రు రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారుల్లా క‌నిపిస్తారు. కానీ స్టేట్ నే మోసం చేస్తారు. ఎవ‌రైనా మోసం చేస్తే కొపం వ‌స్తుంది. కానీ వీళ్ల మోసం న‌వ్వు తెప్పిస్తుంది. హాట్ సమ్మ‌ర్లో కూల్ మూవీ ఇది. సినిమా  బాగా వ‌చ్చింది. పెద్ద స‌క్సెస్ అవుతుంద‌న్న న‌మ్మ‌కం ఉంది` అని అన్నారు.
పాట‌ల ర‌చ‌యిత రాంబాబు మాట్లాడుతూ, ` సినిమాలో మాట‌లు, పాట‌లు బాగా కుదిరాయి. సంగీతం చాలా బాగుంది. `అర్జున్ రెడ్డి` చిత్రానికి గాను ఉగాది పుర‌స్కారం ద‌క్కింది. ఆ సినిమా త‌ర్వాత విడుద‌ల‌వుతున్న చిత్ర‌మిది. పెద్ద స‌క్సెస్ అవుతుంది` అని అన్నారు.
ఈ స‌మావేశంలో ఛాయాగ్రాహ‌కుడు అడుసుమిల్లి విజయ్ కుమార్ త‌దిత‌రులు పాల్గొన్నారు.
ఈ చిత్రంలో  గాయ‌త్రి, అలీ, బెన‌ర్జీ, ష‌క‌ల‌క శంక‌ర్, తాగుబోతు ర‌మేష్, అనంత్, వెంక‌ట్ తేజ్, హారిక‌, అశ్విని, ర‌జిత‌, అపూర్వ‌, బి.హెచ్.ఇ.ఎల్ . ప్ర‌సాద్, ఫ‌ణి,  దాస‌న్న త‌దిత‌రులు న‌టిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం:  యాజ‌మాన్య‌, డి.ఓ.పి: అడుసుమిల్లి విజ‌య్ కుమార్, ఎడిట‌ర్:  గౌతం రాజు, ఆర్ట్:  కె. వి. ర‌మ‌ణ‌, మాట‌లు: భ‌వాని ప్ర‌సాద్, ప్రొడ‌క్ష‌న్ కంట్రో ల‌ర్: ఉయ‌ద్.జె. కుమార్, నిర్మాత‌:  కుమార్, క‌థ‌, స్ర్కీన్ ప్లే, ద‌ర్శ‌క‌త్వం: క‌న్మ‌ణి
- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All