
బాలీవుడ్ లవర్ బాయ్ రణబీర్ కపూర్ ఎట్టకేలకు పెళ్లి చేసుకొని ఓ ఇంటివాడయ్యాడు. రణ్‌బీర్ కపూర్ – అలియా భట్ లు పెళ్లి చేసుకొని ఒకటయ్యారు. నిన్న ( ఏప్రిల్ 14న) పంజాబ్ సంప్రదాయం ప్రకారం.. వీరి వివాహం జరిగింది. బాంద్రాలోని వాస్తు అపార్ట్‌మెంట్‌లో జరిగిన ఈ పెళ్లికి అతి కొద్దీ మంది కుటుంబ సభ్యులు , సన్నిహితులతో హాజరయ్యారు. చిత్రసీమ నుండి నీతూ కపూర్, కరీనా కపూర్ ఖాన్, కరిష్మా కపూర్, మహేశ్ భట్, సోనీ రజ్దాన్, షాహీన్ భట్, సైఫ్ అలీఖాన్, ఆకాశ్ అంబానీ తదితరులు హాజరయ్యారు. ప్రస్తుతం పెళ్లి ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
కొత్త జంటకు నెటిజన్లు సహా సినీ ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. అయితే రణ్‌బీర్ మాజీ లవర్స్ దీపికా పదుకోణె, కత్రినా కైఫ్‌లు న్యూ కపుల్‌కి బెస్ట్ విషెస్ అందజేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు చేయడం మరింత ఇంట్రెస్టింగ్‌గా మారింది.
‘మీ ఇద్దరికి కంగ్రాట్స్. ఆల్ ది లవ్ అండ్ హ్యాపీనెస్’ అంటూ కత్రినా ఇన్‌స్టాలో పోస్ట్ చేయగా.. జీవితాంతం ప్రేమ, చిరునవ్వు, సంతోషం ఉండాలని కోరుకుంటున్నా అంటూ దీపికా పదుకొణె కామెంట్ చేసింది. ప్రస్తుతం వీరిద్దరి పోస్టులు నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి. రణబీర్ ఆలియా కంటే ముందు రణ్‌బీర్.. దీపికా, కత్రినాలతో ప్రేమాయణం నడిపిన సంగతి తెలిసిందే.