Homeటాప్ స్టోరీస్రెండో హాలీవుడ్ సినిమాను ప్రకటించిన దీపికా పదుకోన్

రెండో హాలీవుడ్ సినిమాను ప్రకటించిన దీపికా పదుకోన్

రెండో హాలీవుడ్ సినిమాను ప్రకటించిన దీపికా పదుకోన్
రెండో హాలీవుడ్ సినిమాను ప్రకటించిన దీపికా పదుకోన్

హీరోయిన్ గా దీపికా పదుకోన్ టాప్ రేంజ్ ను టచ్ చేసి చాలా కాలమైంది. ప్రస్తుతం చాలా సెలెక్టివ్ గా సినిమాలు చేస్తోన్న దీపికా పదుకోన్ తన రెండో హాలీవుడ్ చిత్రాన్ని ప్రకటించింది. దీపికా గతంలో విన్ డీజిల్ హీరోగా వచ్చిన XXX: ది రిటర్న్ ఆఫ్ గ్జాన్డర్ కేజ్ చిత్రంలో నటించిన విషయం తెల్సిందే.

ఈసారి రొమాంటిక్ కామెడీలో నటించేందుకు సిద్ధమైంది ఈ భామ. STX ఫిలిమ్స్, టెంపుల్ హిల్ ఎంటర్టైన్మెంట్స్ కలిసి నిర్మిస్తోన్న ఈ రొమాంటిక్ కామెడీలో దీపికా పదుకోన్ హీరోయిన్ గా చేస్తోంది. ఈ చిత్రాన్ని దీపికా సొంత నిర్మాణ సంస్థ కా ప్రొడక్షన్స్ సహ నిర్మిస్తుండడం విశేషం.

- Advertisement -

ఇదిలా ఉంటే ఈ చిత్రంలో నటించే ఇతర నటీనటులు, దర్శకుడు తదితర వివరాలు ఇంకా తెలియరాలేదు. ప్రస్తుతం దీపికా ప్యాన్ ఇండియా చిత్రం ప్రాజెక్ట్ కె లో కూడా నటించనున్న విషయం తెల్సిందే. రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేస్తోన్న ఈ ప్రాజెక్ట్ లో బిగ్ బి అమితాబ్ బచ్చన్ కూడా నటిస్తున్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All