Homeటాప్ స్టోరీస్డియర్ కామ్రేడ్ రివ్యూ

డియర్ కామ్రేడ్ రివ్యూ

Dear Comrade Movie Review in Telugu
Dear Comrade Movie Poster

నటీనటులు : విజయ్ దేవరకొండ -రష్మిక మందన్న
సంగీతం : జస్టిన్ ప్రభాకరన్
దర్శకత్వం : భరత్ కమ్మ
రేటింగ్ : 3.5 / 5
రిలీజ్ డేట్ : 26 జూలై 2019

విజయ్ దేవరకొండ – రష్మిక మందన్న జంటగా నటించిన డియర్ కామ్రేడ్ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి . భరత్ కమ్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది . మరి ఈ సినిమా ప్రేక్షకులను అలరించేలా రూపొందిందా ? లేదా ? అన్నది చూద్దామా !

- Advertisement -

కథ :
స్టూడెంట్ లీడర్ అయిన బాబీ (విజయ్ దేవరకొండ ) విప్లవ భావాలున్ననిజాయితీ కలిగిన వ్యక్తి , అయితే లిల్లీ (రష్మిక మందన్న) ని చూసి లవ్ లో పడతాడు . ఆమెని ఇంప్రెస్ చేసి ముగ్గులోకి దించుతాడు కూడా . లిల్లీ కూడా బాబీ ని ప్రేమిస్తుంది కానీ బాబీ ఆవేశం వల్ల లిల్లీ అతడికి దూరం అవుతుంది . అంతేకాదు బాబీ ఆవేశం లిల్లీ క్రికెట్ జీవితంపై ప్రభావం పడుతుంది . తన ఆవేశం వల్ల లిల్లీ కి జరిగిన అన్యాయాన్ని ఈ డియర్ కామ్రేడ్ ఎలా ఎదిరించాడు ? చివరకు ఏమైంది అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే .

హైలెట్స్ :
విజయ్ దేవరకొండ
రష్మిక మందన్న
జస్టిన్ ప్రభాకరన్ సంగీతం
సందేశం

డ్రా బ్యాక్స్ :
కథనం
సినిమా నిడివి

నటీనటుల ప్రతిభ :
బాబీ పాత్రలో విజయ్ దేవరకొండ అభినయం అద్భుతం . కమ్యూనిస్ట్ భావాలున్న యువకుడిగా విజయ్ దేవరకొండ నటన నభూతో నభవిష్యత్ అనే చెప్పాలి . ఆవేశంతో ఊగిపోయే పాత్రలో జీవించాడు . క్రికెట్ ప్లేయర్ గా రష్మిక మందన్న కూడా అదరగొట్టింది . క్రికెట్ కోసం నాలుగు నెలల పాటు కష్టపడిందట రష్మిక అయితే అంత కష్టం పడినప్పటికీ సినిమాలో ఉన్నది మాత్రం కొన్ని సన్నివేశాలు మాత్రమే ! అయినప్పటికీ ఆ సన్నివేశాల్లో బాగా మెప్పించింది రష్మిక .

ఇక విజయ్ దేవరకొండ – రష్మిక మందన్న ల మధ్య కెమిస్ట్రీ గురించి కొత్తగా చెప్పేదేముంది ఆల్రెడీ గీత గోవిందం లో అదరగొట్టారు ఇప్పుడు పీక్స్ లో ఉంటే ఎలా ఉంటుందో మరోసారి చూపించారు . ఇక మిగిలిన పాత్రల్లో ఆయా నటీనటులు తమతమ పాత్రల పరిధి మేరకు ఆకట్టుకున్నారు .

సాంకేతిక వర్గం :
జస్టిన్ ప్రభాకరన్ సంగీతం ఈ చిత్రానికి హైలెట్ గా నిలిచింది . పాటలు అన్ని కూడా వినడానికి బాగున్నాయి , ఇక తెరమీద మరింత అందంగా ఉన్నాయి . అలాగే నేపథ్య సంగీతం కూడా ఈ చిత్రానికి ఆయువు పట్టుగా నిలిచింది . విజువల్స్ బాగున్నాయి . విజయ్ దేవరకొండ – రష్మిక మందన్న లను మరింత అందంగా చూపించారు . నిర్మాణ విలువలు బాగున్నాయి .

ఇక దర్శకులు భరత్ కమ్మ విషయానికి వస్తే ……. యూత్ కి కనెక్ట్ అయ్యే కథని ఎంచుకున్నా స్క్రీన్ ప్లే మరింత ఫాస్ట్ గా ఉంటే ఇంకా బాగుండేదేమో ! అక్కడక్కడా సాగతీత సన్నివేశాలతో ఫస్టాఫ్ లో అలాగే సెకండాఫ్ లో కూడా ఇబ్బంది పడుతున్నారు . వాటిని కొని ఎడిట్ చేస్తే మరింతగా బాగుంటుంది .

ఓవరాల్ గా :
యూత్ కి కనెక్ట్ అయ్యే డియర్ కామ్రేడ్

Click Here: Dear Comrade Movie Review in English

YouTube video
- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All