Homeటాప్ స్టోరీస్డియర్ కామ్రేడ్ ఫుల్ మూవీ లీకయ్యింది

డియర్ కామ్రేడ్ ఫుల్ మూవీ లీకయ్యింది

Dear Comrade
Dear Comrade

విజయ్ దేవరకొండ నటించిన డియర్ కామ్రేడ్ చిత్రం నిన్న విడుదల అవ్వడమే ఆలస్యం మొత్తం సినిమాని లీక్ చేసారు తమిళ రాకర్స్ . సినిమా విడుదల అవ్వడమే ఆలస్యం వెంటనే ఆన్ లైన్ లో పెట్టేస్తున్నారు తమిళ రాకర్స్ . ఇప్పటికే పలు చిత్రాలను లీక్ చేయగా తాజాగా డియర్ కామ్రేడ్ కూడా పైరసీ బారిన పడింది . డియర్ కామ్రేడ్ చిత్రాన్ని పైరసీ చేయకుండా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా అవలీలగా దాన్ని పైరసీ చేస్తున్నారు .

దర్శక నిర్మాతలకు , హీరోలకు సవాల్ విసురుతున్నారు తమిళ రాకర్స్ . ఒక్క తమిళ రాకర్స్ మాత్రమే కాదు పెద్ద ఎత్తున సీడీ , డివిడి లు చేసి అమ్మేవాళ్ళు కోకొల్లలు అయ్యారు గ్రామీణ ప్రాంతాల్లో . అసలే డియర్ కామ్రేడ్ చిత్రానికి నెగెటివ్ టాక్ బాగా స్ప్రెడ్ అవుతోంది . ఇలాంటి సమయంలో పైరసీ కూడా తోడైతే ఈ సినిమా గట్టెక్కడం కష్టమే అనుకుంటా !

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All