Homeటాప్ స్టోరీస్అజిత్ షూటింగ్ లో విషాదం ఒకరి మృతి

అజిత్ షూటింగ్ లో విషాదం ఒకరి మృతి

Dancer died in ajith's vishwasam setతమిళ స్టార్ హీరో అజిత్ తాజాగా నటిస్తున్న విశ్వాసం షూటింగ్ లో విషాదం నెలకొంది . పూణే లో షూటింగ్ జరుగుతున్న సమయంలో ఓ డ్యాన్సర్ అకస్మాత్తుగా కిందపడిపోవడంతో అతడ్ని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు అయితే అప్పటికే ఆ డ్యాన్సర్ మృతి చెందినట్లు ప్రకటించారు డాక్టర్లు . దాంతో విశ్వాసం షూటింగ్ నిలిచిపోయింది . అలాగే హీరో అజిత్ ఈ సంఘటనతో పూర్తిగా చలించి పోయాడు . తక్షణం అతడి మృతదేహాన్ని చెన్నై కి తరలించడానికి ఏర్పాట్లు చేయడమే కాకుండా అతడి కుటుంబానికి 8 లక్షల ఆర్ధిక సహాయాన్ని ప్రకటించాడు . పూణే లో విశ్వాసం చిత్రానికి సంబందించిన పాట చిత్రీకరిస్తున్నారు . ఆ సమయంలో ఈ సంఘటన జరిగింది .

విశ్వాసం చిత్రానికి శివ దర్శకత్వం వహిస్తున్నాడు . అజిత్ – శివ ల కాంబినేషన్ లో ఇప్పటివరకు మూడు చిత్రాలు రాగా వీరం , వేదళం . వివేగం మూడు కూడా హిట్ అయ్యాయి . హ్యాట్రిక్ విజయం తర్వాత నాల్గోసారి మళ్ళీ చేస్తున్న చిత్రం . ఇటీవలే విశ్వాసం ఫస్ట్ లుక్ పోస్టర్ పై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి . ఫస్ట్ లుక్ అంతగా అభిమానులను అలరించలేకపోతోంది .

- Advertisement -

English Title : Dancer died in ajith’s vishwasam set

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All