
మెగా , నందమూరి అభిమానులు ఫుల్ ఖుషి లో ఉన్నారు. ఎన్టీఆర్ , రామ్ చరణ్ నటించిన ఆర్ఆర్ఆర్ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయం సాధించి వసూళ్ల వర్షం కురిపిస్తుంది. మొదటి రెండు రోజుల్లోనే రూ. 350 కోట్లు రాబట్టి తెలుగు సినిమా సత్తా ను చాటి చెప్పింది. అయితే సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న చిత్ర యూనిట్ కు ..అభిమానులు చేస్తున్న ఓ పని తలనొప్పిగా మారింది. సినిమా చూస్తూ సినిమాలోని హైలైట్స్ ను ఫోన్లలో షూట్ చేసి సోషల్ మీడియా లో అప్లోడ్ చేస్తున్నారు. ఇది సినిమాకు మైనస్ గా మారుతుంది. దీంతో చిత్ర మేకర్స్ అభిమానులకు రిక్వెస్ట్ చేసారు.
డివివి నిర్మాణ సంస్థ ట్వీట్ లో దయచేసి సినిమాకు సంబంధించిన సన్నివేశాలను ఇలా షూట్ చేసి సోషల్ మీడియాలో యూట్యూట్ లో షేర్ చేయవద్దని విజ్ఞప్తి చేశారు. అలా చేయడం ద్వారా సినిమా పై జనాల్లో ఆసక్తి తగ్గుతుందని వారు తెలియజేశారు. సినిమాకు చాలా డ్యామేజీ చేసే ఆ పని చేయవద్దంటూ ప్రతి ఒక్కరిని మేకర్స్ రిక్వెస్ట్ చేశారు. ఇప్పటికే జరగాల్సిన నష్టం జరిగి పోయింది.. ఇప్పుడు చిత్ర యూనిట్ సభ్యులు అప్పీల్ చేయడం ద్వారా ఉపయోగం ఏమీ లేదు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.