Homeటాప్ స్టోరీస్దమ్ముంటే సొమ్మేరా రివ్యూ

దమ్ముంటే సొమ్మేరా రివ్యూ

dammunte sommera review
దమ్ముంటే సొమ్మేరా రివ్యూ

దమ్ముంటే సొమ్మేరా రివ్యూ
నటీనటులు : సంతానం , అంచల్ సింగ్ , కరుణాస్
సంగీతం : తమన్
నిర్మాత : నటరాజ్
దర్శకత్వం : రాంబాల
రేటింగ్ : 3/ 5
రిలీజ్ డేట్ : 22 జూన్ 2018

తమిళనాట 2016 లో విడుదలై సూపర్ హిట్ అయిన ” దిల్లుడు దుడ్డు ” చిత్రాన్ని తెలుగులో ” దమ్ముంటే సొమ్మేరా ” గా డబ్ చేసారు నటరాజ్ . స్టార్ కమెడియన్ సంతానం హీరోగా నటించిన ఈ చిత్రంలో అంచల్ సింగ్ , కరుణాస్ , ఆనంద్ రాజ్ , రాజేంద్రన్ తదితరులు నటించారు . ఈరోజు తెలుగునాట విడుదల అవుతున్న ఈ దమ్ముంటే సొమ్మేరా ప్రేక్షకులను అలరిస్తుందా ? లేదా ? అన్నది తెలియాలంటే కథ లోకి వెళ్లాల్సిందే .

- Advertisement -

కథ :

కుమార్ (సంతానం ) అంటే కాజల్ ( అంచల్ సింగ్ ) కు చిన్నప్పటి నుండి ఇష్టం , అది ప్రేమగా మారుతుంది అయితే అనుకోని కారణాల వల్ల చిన్నప్పుడే కుమార్ – కాజల్ లు దూరం అవుతారు . కాజల్ విదేశాల్లో చదువు పూర్తిచేసుకొని మనసులో కుమార్ నే తలుచుకుంటూ ఇండియాకు వచ్చి అతడి కోసం వెదుకుతుంటుంది . ఎట్టకేలకు కాజల్ శ్రమ ఫలించి కుమార్ అడ్రస్ తెలుసుకుంటుంది , అయితే మిడిల్ క్లాస్ కి చెందిన కుమార్ కు తన కూతురు కాజల్ ని ఇచ్చి పెళ్లి చేయడం కాజల్ తండ్రికి ఇష్టం ఉండదు . దాంతో అతడ్ని చంపించడానికి పెళ్లి పేరుతో ఓ పురాతన బంగ్లా కు తీసుకువెళతారు . ఆ బంగ్లా లో దెయ్యాలు ఉంటాయి , కుమార్ ని ఆ దెయ్యాల పేరుతో చంపడానికి చేసిన ప్లాన్ విజయవంతం అయ్యిందా ? ఆ దెయ్యాలు ఏం చేసాయి ? చివరకు కుమార్ ఎలా విజయం సాధించి తన ప్రేమని నిరూపించుకున్నాడు తదితర విషయాలన్నీ తెలియాలంటే సినిమా చూడాల్సిందే .

హైలెట్స్ :

సంతానం మేకోవర్
రాజేంద్రన్ కామెడీ
ఎంటర్ టైన్ మెంట్

డ్రా బ్యాక్స్ :
ఫస్టాఫ్ లో కొన్ని సన్నివేశాలు

నటీనటుల ప్రతిభ :

స్టార్ కమెడియన్ సంతానం తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడే ! అయితే కమెడియన్ హీరో అనగానే ఒకలా ఎక్స్ పెక్ట్ చేస్తారు కానీ అందరి అంచనాలకు భిన్నంగా తన మేకోవర్ తో షాక్ ఇచ్చాడు . లుక్స్ , గెటప్ పరంగా జాగ్రత్తలు తీసుకొని ప్రేక్షకుల చేత మెప్పించాడు . ఇక నటనలో సంతానం గురించి కొత్తగా చెప్పేదేముంది అయితే ఇన్నాళ్లు హాస్య నటుడిగానే తెలుసు కానీ తనలో హీరో మెటీరియల్ కూడా ఉందని చాటిచెప్పాడు ఈ చిత్రంతో . హీరోయిన్ అంచల్ సింగ్ గ్లామర్ తో అలరించడమే కాకుండా నటన ని కూడా ప్రదర్శించి మార్కులు కొట్టేసింది . రాజేంద్రన్ కామెడీ కూడా హైలెట్ గా నిలిచింది , కరుణాస్ , ఆనంద్ రాజ్ లు కూడా నవ్వించారు . ఇక మిగతా పాత్రల్లో ఆయా నటీనటులు తమతమ పాత్రల పరిధి మేరకు నటించారు .

సాంకేతిక నిపుణులు :

హర్రర్ నేపథ్యంలో రూపొందే చిత్రాలకు నేపథ్య సంగీతం ప్రధానం కాగా ఈ చిత్రానికి తమన్ అందించిన సంగీతం హైలెట్ గా నిలిచింది . ఛాయాగ్రహణం కూడా అదనపు ఆకర్షణ , గోపికృష్ణ ఎడిటింగ్ బాగుంది అయితే మరికొన్ని సన్నివేశాలు ఫస్టాఫ్ లో కట్ చేసి ఉండొచ్చు . నటరాజ్ నిర్మాణ విలువలు బాగున్నాయి . ఇక దర్శకుడు రాంబాల విషయానికి వస్తే …… సంతానం ని హీరోగా సక్సెస్ ఫుల్ గా లాంచ్ చేసి అందరి చేత శభాష్ అనిపించుకున్నాడు . సంతానం ని సరికొత్తగా చూపించి తన ప్రతిభ చూపించాడు . హర్రర్ కథకి ప్రేమని హాస్యాన్ని జోడించి మెప్పించాడు రాంబాల .

ఓవరాల్ గా :

నవ్వించి , భయపెట్టి టైం పాస్ చేసే……. దమ్ముంటే సొమ్మేరా

             Click here for English Review

YouTube video
- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All