Homeటాప్ స్టోరీస్సల్మాన్-ప్రభుదేవా కాంబో, అప్పుడు సూపర్ హిట్, మరి ఇప్పుడు?

సల్మాన్-ప్రభుదేవా కాంబో, అప్పుడు సూపర్ హిట్, మరి ఇప్పుడు?

సల్మాన్-ప్రభుదేవా కాంబో, అప్పుడు సూపర్ హిట్, మరి ఇప్పుడు?
సల్మాన్-ప్రభుదేవా కాంబో, అప్పుడు సూపర్ హిట్, మరి ఇప్పుడు?

సల్మాన్ ఖాన్ కెరీర్ కష్టాల్లో ఉన్న సమయంలో, వరస ప్లాఫుల్లో ఉన్న సమయంలో విడుదలైన సినిమా వాంటెడ్. ప్రభుదేవా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. పోకిరిని సల్మాన్ స్టైల్ లోకి మార్చి వాంటెడ్ గా బాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు ప్రభుదేవా. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. ప్రభుదేవా అక్కడ దర్శకుడిగా స్థిరపడిపోయాడు. సల్మాన్ ఖాన్ ఈ సినిమాతో వచ్చిన సక్సెస్ ను నిలబెట్టుకుంటూ ముందుకు సాగిపోతూ వచ్చాడు. వాంటెడ్ తర్వాత ఈ ఇద్దరూ కలిసి పనిచేద్దామని భావించినా అది వర్కౌట్ కాలేదు. చివరికి దబంగ్ 3తో అది సాధ్యమైంది. దబంగ్ సినిమా సల్మాన్ కెరీర్ లో ప్రత్యేకమైంది. ఈ సినిమా అక్కడ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది.

అయితే దబంగ్ 2 మాత్రం అనుకున్న రేంజ్ లో సక్సెస్ కాలేదు. ఆ సినిమాకు ఓపెనింగ్స్ వచ్చినా కానీ చివరికి ఫెయిల్యూర్ ప్రాజెక్ట్ గానే మిగిలిపోయింది. ఈ చిత్రానికి సల్మాన్ సోదరుడు అర్బాజ్ ఖాన్ దర్శకుడు. అనుభవ లేమి కారణంగా ఈ సినిమా పోయి ఉంటుందని భావించారు. అందుకే దబంగ్ 3 కోసం ప్రభుదేవాను పిలిపించాడు సల్మాన్ ఖాన్. ఈ చిత్రం రీసెంట్ గా 20న విడుదలైన సంగతి తెల్సిందే. అయితే ఈ చిత్రం ప్రేక్షకుల నుండి మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. క్రిటిక్స్ అయితే ఈ చిత్రాన్ని ఏకిపడేసారు. తమకి తోచినట్లుగా స్క్రీన్ ప్లేను ఒక పద్దతి లేకుండా తీసుకుంటూ పోయారని దుయ్యబట్టారు.

- Advertisement -

అయినా దబంగ్ 3 మాస్ సినిమా, అందులోనూ సల్మాన్ మ్యానరిజమ్స్ పై ఎక్కువగా ఆధారపడి తీసిన సినిమా. దీంతో భాయ్ ఫ్యాన్స్ ఈ చిత్రాన్ని నిలబడతారని అంతా భావించారు. అయితే అదేమీ నిజం కాదని తేలిపోయింది. దబంగ్ 3 కు కనీస ఓపెనింగ్స్ రాలేదు. సల్మాన్ గత చిత్రం భారత్ 43 కోట్ల రూపాయల గ్రాస్ సాధిస్తే, దబంగ్ 3 కేవలం 24 కోట్ల గ్రాస్ వసూళ్లతో తేలిపోయింది. శనివారం, ఆదివారం వసూళ్లు ఇంకా తక్కువే ఉన్నాయి కానీ గ్రోత్ లేదు. హిందీతో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో వచ్చిన వసూళ్లు ఇవి.

సోమవారం నుండి వసూళ్లు మరింత నెమ్మదించే అవకాశం ఉన్నందున దబంగ్ 3ను డిజాస్టర్ ఖాతాలోకి వేసేస్తున్నారు ట్రేడ్ పండితులు. ఫుల్ రన్ లో 100 కోట్లకు అటూ ఇటూగా కలెక్షన్స్ ఉండొచ్చని అభిప్రాయపడుతున్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All