
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో ప్రకాష్ రాజ్, మంచు విష్ణులతో పాటుగా సీనియర్ నటుడు సి.వి.ఎల్ నరసిం హా రావు కూడా పోటీలో నిలిచేందుకు ఆసక్తి చూపారు. ప్రకాష్ రాజ్ నామినేషన్ వేసిన రోజే ఆయన కూడా నామినేషన్ వేశారు. అంతేకాదు నేడు తన మేనిఫెస్టో కూడా రిలీజ్ చేశారు. మరి అంతలోనే ఏమైందో ఏమో కాని మా ఎలక్షన్స్ నుండి ఆయన తన నామినేషన్ ను ఉపసం హరించుకున్నారు.
సి.వి.ఎల్ తీసుకున్న ఈ నిర్ణయం అందరికి షాక్ ఇచ్చింది. తను ఎందుకు నామినేషన్ విత్ డ్రా చేసుకున్నా అన్నది తర్వాత చెబుతానని అన్నారు సి.వి.ఎల్. ప్రస్తుతం మా సభ్యుల అందరు బాగుండాలనే తన ఉద్దేశమని అన్నారు. ఇక పోటీ పడుతున్న మంచు విష్ణు, ప్రకాష్ రాజ్ ఇద్దరిలో ఎవరికి తన సపోర్ట్ అన్నది కూడా వెల్లడించలేదు సి.వి.ఎల్.
సి.వి.ఎల్ ఇన్ డైరెక్ట్ గా ప్రకాష్ రాజ్ ప్యానల్ కు సపోర్ట్ గా నిలుస్తున్నరన్నది తెలుస్తుంది. ప్రస్తుతం మా ఫైట్ లో ప్రకాష్ రాజ్ వర్సెస్ మంచు విష్ణు నువ్వా నేనా అన్నట్టు పోటీ ఉంది. మరి ఈ ఫైట్ లో గెలిచేది ఎవరన్నది చూడాలి.