Homeటాప్ స్టోరీస్“ఫ్లిప్ కార్ట్” పైనే ఎక్కువ ఫిర్యాదులు

“ఫ్లిప్ కార్ట్” పైనే ఎక్కువ ఫిర్యాదులు

“ఫ్లిప్ కార్ట్” పైనే ఎక్కువ ఫిర్యాదులు
“ఫ్లిప్ కార్ట్” పైనే ఎక్కువ ఫిర్యాదులు

ఏదైనా ఒక వస్తువు కొన్నప్పుడు బాగోకపోయినా, లేక ఇతర నచ్చకపోయినా కొన్న దగ్గరకి వెళ్లి మార్చుకుంటూ ఉంటాం. కొంతమంది మనకి నచ్చినవి మళ్ళీ మార్చి ఇస్తారు. కొంతమంది ఇవ్వరు. ఇచ్చిన వాళ్ళ దగ్గరకి మళ్ళీ వెళ్తాం. ఇవ్వని వాళ్ళని బండ బూతులు తిట్టుకుంటూ ఉంటాం. ఇంతకీ విషయం ఏంటంటే, జనాలు పూర్తిగా ఇప్పుడు ఆన్ లైన్ షాపింగ్ కి అలవాటు పడిపోయారు. ఏదైనా ఒక వస్తువుని ఎవరో డబ్బులు తీసుకొని ఇచ్చిన రేటింగులు మీద స్టార్ల మీద ఆధారపడి జనాలు అవసరం ఉన్నా లేకపోయినా, అరచేతిలో ఫోన్ ఉంది కదా! అని ఆన్ లైన్ లో కొనేస్తున్నారు. “సందట్లో సడేమియా” లాగా కొంతమంది నకిలీ బ్యాచ్ ఆన్ లైన్ లో ఫోన్ కోసం బుక్ చేస్తే రాళ్లు పంపించడం, చొక్కా & ప్యాంటు బుక్ చేస్తే చిరిగిపోయిన దుప్పట్లు పంపించడం.. అప్పుడప్పుడు ఇలాంటి వార్తలు కూడా వింటూ ఉన్నాం. ప్రపంచవ్యాప్తంగా ఈ కామర్స్ రంగం ఎంతో విస్తృతంగా మారిపోయింది. వీళ్ల దగ్గర స్టాక్ మిగిలిపోయిన ప్పుడల్లా ఇయర్ ఎండ్ సేల్ అని, ఇండిపెండెన్స్ డే అని ఇష్టమొచ్చినట్లు ఆఫర్లు పెడుతున్నారు. వినియోగదారులు కూడా ప్రస్తుతం చేసే ఫిర్యాదులో అధికశాతం ఈ కామర్స్ సమస్యలపైనే ఉన్నాయట.

అందులోనూ భారతదేశ ఈ కామర్స్ రంగంలో గట్టిపోటీ ఇస్తున్న దిగ్గజ సంస్థ “ఫ్లిప్ కార్ట్” పై ఈ కంప్లైంట్ లో ఎక్కువగా వస్తున్నాయి. ఆ తర్వాతి స్థానాల్లో రిలయన్స్ జియో, అమెజాన్ మరియు ఒక ప్రభుత్వ రంగ బ్యాంకులు ఉన్నాయి. అదేవిధంగా ప్రతి సంవత్సరం గత సంవత్సరంతో పోలిస్తే 40 నుంచి 50 శాతం వరకు ఫిర్యాదులు పెరుగుతున్నాయని గణాంకాలు చెబుతున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు 5 లక్షలకు పైగా ఫిర్యాదులు రాగా, వాటిలో లక్షకు పైగా ఫిర్యాదులు ఈ కామర్స్ సంస్థలకు సంబంధించినవే. బ్యాంకులపై 41, 600 టెలికాం సంస్థలపై 29,400 ఉన్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో కూడా 5,60,300 ఫిర్యాదులలో, లక్ష వరకు ఈ కామర్స్ పైనే ఉన్నాయి. ఈ ఫిర్యాదులో ఎక్కువగా అడిగిన వస్తువులు పంపించలేదని, పాడై పోయిన వస్తువులు పంపించారని, ఎక్చేంజ్ చేసుకోవడం లేదని, ఆర్డర్ చేసినప్పుడు ఆలస్యంగా పంపిస్తున్న ఫిర్యాదులే ఎక్కువగా ఉన్నాయి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All