
కరోనా సెకండ్ వేవ్ దేశ వ్యాప్తంగా విలయాన్ని సృష్టిస్తోంది. దీని ధాటికి అన్ని రంగాలు చేతులెత్తేస్తున్నాయి. ప్రభుత్వాలతో పాటు ప్రైట్ రంగాలు కూడా కరోనాని దెబ్బకు విల విలలాడుతున్నాయి. ఈ నేపథ్యంలో అన్ని రంగాల తరహాలోనే సినీ రంగంపై కూడా దీని ప్రభావం పడింది. మిగతా రంగాలతో పోలిస్తే కరోనా ప్రభావం సినీ రంగంపై కొంత ఎక్కువే వుందని చెప్పాలి.
కరోనా దెబ్బకు చాలా వరకు చిత్రాల షూటింగ్‌లు ఆగిపోయాయి. కొన్ని రిలీజ్‌లు కూడా వాయిదా పడ్డాయి. కొన్ని సినిమాలు కరోనా దెబ్బతో థియేటర్లు మూసివేయడంతో డిజిటల్ ప్లాట్ ఫామ్‌ల బాటపట్టాయి. `దృశ్యం 2` లాంటి చిత్రాలు ఓటీటీల్లో విడుదలయ్యమేందుకు సిద్ధమవుతున్నాయి. ఇదిలా వుంటే కరోనా భయంతో స్టార్ హీరోల చిత్రాల షూటింగ్‌లు మధ్యలోనే ఆగిపోయినా నేచురల్ స్టార్ నాని తన `శ్యామ్ సింగరాయ్` షూటింగ్‌ని మాత్రం ఆపడం లేదు.
కరోనా భయంలో చాలా మంది తమ సినిమా షూటింగ్‌లని నిలిపివేస్తే నాని మాత్రం కరోనా గిరోనా జాన్తానై అంటూ `శ్యామ్ సింగరాయ్` షూటింగ్‌ని ఆపడం లేదు. హైదరాబాద్‌లో ప్రత్యేకంగా వేసిన సెట్‌లో ఈ మూవీ షూటింగ్‌ని కంటిన్యూ చేస్తున్నారు. అయితే దీనిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కరోనా ఎప్పుడు ఎలా ఎవరిని కాటేస్తుందో తెలియని విపత్కర పరిస్థితుల్లో ఇలా యూనిట్ మెంబర్స్ ప్రాణాలతో రిస్క్ చేయడం అవసరమా? అని అంతా విమర్శలకు దిగుతున్నారు. అయితే షూటింగ్ ఆపేస్తే ప్రొడక్షన్ పరంగా భారీ నష్టం వాటిల్లే ప్రమాదం వున్నందున `శ్యామ్ సింగరాయ్` షూటింగ్‌ని ఆపకుండా కంటిన్యూ చేస్తున్నారట. ఎంత నష్టం వాటిల్లినా ప్రాణాలు పోతే ఎవరిది బాధ్యతని విమర్శలు వినిపిస్తున్నాయి.