
సూపర్ స్టార్ మహేష్ బాబు అటు సిల్వర్ స్క్రీన్ మీదే కాదు టివి ప్రపంచంలో కూడా టాప్ స్టార్. ముఖ్యంగా అడ్వార్టైజ్మెంట్స్ విషయంలో మహేష్ ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నాడు. మహేష్ బాబు ప్రస్తుతం డజనుకు పైగా బ్రాండ్స్ ను ఎండోర్స్ చేస్తున్నాడు. తాను ఎండోర్స్ చేసే బ్రాండ్ విషయంలో పక్కాగా ఉండే మహేష్ రీసెంట్ గా చేసిన ఒక యాడ్ మాత్రం కొన్ని వర్గాలను నిరుత్సాహానికి గురిచేసింది.
అదే పాన్ బహార్ యాడ్. మెయిన్ గా గుట్కాను సప్లై చేసే ఈ బ్రాండ్ పై చాలానే విమర్శలు ఉన్నాయి. ఈ పొగాకు ఉత్పత్తులను వాడటం ద్వారా క్యాన్సర్ వస్తుందనేది ప్రధాన అభియోగం. అయితే ఇవేం నిరూపించబడలేదు. కానీ అసలు ఇన్ని అభియోగాలు ఉన్న బ్రాండ్ ను మహేష్ ఎందుకు ఎండోర్స్ చేయాల్సి వచ్చింది అనేది నెటిజన్లు అడిగే ప్రధాన ప్రశ్న.
ఇప్పటికే బోలెడు బ్రాండ్లను ప్రమోట్ చేస్తోన్న మహేష్ పాన్ బహార్ కు మాత్రం దూరంగా ఉండాల్సింది అని అంటున్నారు. మరి దీనిపై మహేష్ వర్గాలు ఏమైనా సమాధానమిస్తాయా?