Homeన్యూస్క్రైమ్ 23 మూవీ రివ్యూ

క్రైమ్ 23 మూవీ రివ్యూ

Crime 23 Reviewక్రైమ్ 23 మూవీ రివ్యూ :
టైటిల్ : క్రైమ్ 23
జానర్ : క్రైమ్ థ్రిల్లర్ ( మెడికల్ )
తారాగణం : అరుణ్ విజయ్ , మహిమ నంబియర్
సంగీతం : విశాల్ చంద్ర శేఖర్
దర్శకత్వం : ఆర్యజహాగన్ వెంకటాచలం
నిర్మాత : ప్రసాద్ భర్మ రెడ్డి, శంకర్ రావు, సురపతి గాంధీ, ఇందిర్ కుమార్
రిలీజ్ తేదీ : ఆగష్టు 31, 2018

తమిళ నటుడు అరుణ్ విజయ్ కీలకపాత్ర పోషించిన చిత్రం క్రైమ్ 23. తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన అరుణ్ విజయ్ హీరోగా నటించిన ఈ చిత్రం క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందింది. మరి ఈ క్రైమ్ థ్రిల్లర్ ప్రేక్షకులను అలరించేలా రూపొందిందా ? లేదా ? అన్నది తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే.

కథ :

- Advertisement -

చిత్రం రెండు హత్యలతో ప్రారంభమవుతుంది. ఒక ప్రీస్ట్ మరియు ప్రముఖ ఛానల్ CEO భార్య చర్చిలో చంపబడతారు. ఆ కేసుని ఐపిఎస్ అధికారి అరుణ్ విజయ్ కి అప్పగిస్తారు. దర్యాప్తు లో భాగంగా హత్యల వెనుక ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటాడు పోలీస్ అధికారి. వైద్యం మాటున అవయవాలను దోచుకునే హాంతక ముఠా ఈ హత్యలు వెనకాల ఉందని తెలుసుకుంటాడు. ఈ హత్యలను చేయిస్తున్నది ఎవరు ? ఆ హంతక ముఠాని అంతం చేశాడా ? లేదా ? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

నటీనటులు :

అరుణ్ విజయ్ విజయవంతమైన హీరో. అతను రామ్ చరణ్ నటించిన బ్రూస్ లీ అలాగే ఎంతా వాడు గాని వంటి తెలుగు చిత్రాలలో విలన్ పాత్రలు పోషించి మెప్పించాడు. తాజాగా విజయ్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న సాహూ చిత్రంలో కూడా నటిస్తున్నాడు. ఇక ఈ చిత్ర విషయానికి వస్తే పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో అరుణ్ విజయ్ అద్భుతంగా నటించాడు. యాక్షన్ సన్నివేశాలలో అరుణ్ విజయ్ ఇరగదీసాడు.థాంబి రామయ్య కామెడీతో ఆకట్టుకున్నాడు. హీరోయిన్ మహిమా నంబియార్ కు మంచి పాత్ర లభించింది.
సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తూనే ఎమోషనల్‌ సీన్స్‌లో కంటతడి పెట్టించాడు. ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్‌, క్లైమాక్స్‌ సీన్స్‌లో హీరో చూపించిన పాత్ర సూపర్బ్‌ .

 

విశ్లేషణ :

ఈ చిత్రంలో కథ మరియు సంగీతం ప్రధాన పాత్ర పోషిస్తుంది. నాని యొక్క ‘కృష్ణగడి వీర ప్రేమ గదా’ కు సంగీతాన్ని అందించిన విశాల్ చంద్రశేఖర్ క్రైమ్ 23 కి అద్భుతమైన సంగీతాన్ని అందించాడు. ఈ చిత్రం ఎడ్జ్-ఆఫ్-ది-సీట్ క్రైమ్ థ్రిల్లర్గా ఉంటుంది మరియు నేపథ్య చిత్రం ఈ చిత్రం . స్టంట్ సిల్వా చేసిన స్టంట్స్ మరొక హైలైట్. యాక్షన్ భాగాలు కథ మలుపులు మరియు మైండ్ గేమ్ లా సాగిపోతుంది. థ్రిల్డ్ ఉంటుంది. ఇది అరిజాజగన్ వెంకటాచలం దర్శకత్వం వహించిన స్టైలిష్ యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్.క్రైమ్ 23 అనేక మలుపులు మరియు మలుపులు తో స్టైలిష్ క్రైమ్ గా చేశారు.

 

ప్లస్‌ పాయింట్స్‌ :

అరుణ్ విజయ్ , మహిమ నంబియర్
నేపథ్య సంగీతం
కథ
ఎడిటింగ్
సెకండ్ హాఫ్
స్క్రీన్ ప్లే

మైనస్‌ పాయింట్స్‌ :

సీరియస్ గా కధనం
ఫస్ట్ హాఫ్

 

చివరి మాట : మాతృమూర్తులకు ఈ సినిమా అంకితం. ప్రతి తల్లి చూడలిసిన చిత్రం క్రైమ్ 23.

రేటింగ్ : 3 /5

YouTube video
- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All