Homeగాసిప్స్చియాన్ విక్రం సినిమాలో విలన్ గా ఇర్ఫాన్ పఠాన్..?

చియాన్ విక్రం సినిమాలో విలన్ గా ఇర్ఫాన్ పఠాన్..?

చియాన్ విక్రం సినిమాలో విలన్ గా ఇర్ఫాన్ పఠాన్..?
చియాన్ విక్రం సినిమాలో విలన్ గా ఇర్ఫాన్ పఠాన్..?

చియాన్ విక్రమ్ 58వ సినిమాలో విలన్ గా క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ నటిస్తున్నాడా.? క్రికెట్ ఆటలో అటు బౌలర్ గా, ఇటు బ్యాట్స్మెన్ గా ఆల్ రౌండర్ పెర్ఫామెన్స్ చేసిన ఇర్ఫాన్ పఠాన్ ఇప్పుడు సినిమాల పరంగా కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. అదేదో చిన్న సినిమాలో అనుకుంటే పొరపాటే. తమిళ్ స్టార్ హీరో చియాన్ విక్రం లేటెస్ట్ సినిమాలో నటిస్తున్నాడు మన ఇర్ఫాన్ పఠాన్.

ఇటీవల విక్రమ్ నటించిన సినిమా కాదరన్ కొండెన్ సినిమా భారీ అంచనాల మధ్యన విడుదల అయ్యి ఫ్లాప్ అయింది. తెలుగులో ఈ సినిమాని మిస్టర్ కేకే పేరుతో విడుదల చేశారు. తెలుగు ప్రేక్షకులను కూడా ఈ సినిమా ఏ మాత్రం ఆకట్టుకోలేదు.

- Advertisement -

గత కొద్ది రోజులుగా చియాన్ విక్రమ్ తన కొడుకు ధృవ్ నటించిన ఆదిత్య వర్మ సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉన్నాడు. ఇప్పుడు తన 58వ సినిమాని అజయ్ జ్ఞాన ముత్తు దర్శకత్వంలో చేస్తున్నాడు. అజయ్ జ్ఞాన ముత్తు గురించి చెప్పాలంటే ఇటీవల తెలుగు లో రిలీజ్ అయి, సైలెంట్ గా హిట్ అయిన నయనతార డబ్బింగ్ మూవీ “అంజలి సిబిఐ” మూవీ డైరెక్టర్ అజయ్ జ్ఞాన ముత్తు. బాలీవుడ్ టాప్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ ఆ సినిమాలో విలన్ గా నటించాడు.

ఆ సినిమా చూసిన ప్రతి వారికి అజయ్ జ్ఞాన ముత్తు దర్శకత్వ ప్రతిభ ఏమిటో అర్థమవుతుంది. ప్రస్తుతం విక్రం 58 అనే వర్కింగ్ టైటిల్ తో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ ఒక స్టైలిష్ లుక్ లో కనిపించబోతున్నాడు.

ఇటీవల ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభమైంది. ఇర్ఫాన్ తన మొదటి షెడ్యూల్ పూర్తిచేశారు. K.G.F సినిమా ఫేమ్ శ్రీనిధి శెట్టి ఈ సినిమా హీరోయిన్. త్వరలో ఈ సినిమా మరో భారీ షెడ్యూల్ కేరళలో ప్రారంభం కాబోతోంది. విక్రమ్ కి మాత్రం ఈ సినిమా చాలా ఇంపార్టెంట్. ఇప్పటివరకు క్రికెట్ తో మనల్ని అలరించిన ఇర్ఫాన్ పఠాన్ ఇకపై వెండితెరపై కూడా తనదైన ముద్ర వేస్తాడని కోరుకుందాం.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All