
భారత కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా ఘనంగా నిర్వహించే పద్మ అవార్డు కార్యక్రమానికి సైతం కరోనా ఎఫెక్ట్ తగిలింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా నమోదైన 84 పాజిటివ్ కరోనా వైరస్ కోవిడ్ 19 బాధితులలో ఇద్దరు తాజాగా మరణించిన నేపధ్యంలో దేశ వ్యాప్తంగా జరిగే అన్ని పబ్లిక్ ఈవెంట్స్, కార్యక్రమాలు, ఎగ్జిబిషన్ లు, సభలు, సమావేశాలు ఎక్కువగా పబ్లిక్ లేకుండా నిర్వహిస్తున్నారు. సినిమా ఈవెంట్ లు, అవార్డ్ ఫంక్షన్స్ సైతం లైవ్ ఇచ్చి జనాలు లేకుండా నిర్వహిస్తున్నారు. అయితే ఇప్పుడు తాజాగా వచ్చే నెల ఏప్రిల్ 3వ తేదీన రాష్ట్రపతి భవన్ లో జరగవలసిన పద్మ అవార్డు కార్యక్రమాన్ని సైతం క్యాన్సిల్ చేసారు. కొత్త డేటు త్వరలో ప్రకటించే అవకాశం ఉంది.
దేశంలో అనేక రంగాలకు సంబంధించి విశేషకృషి చేసిన వాళ్ళకు పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ అవార్డులు ప్రతీ సంవత్సరం రాష్ట్రపతి చేతులమీదుగా అందిస్తారనే విషయం మనకు తెలిసిందే. ప్రభుత్వ కార్యక్రమాలకు సైతం కరోనా సెగ తాకడం చూస్తుంటే మనం అందరం జాగ్రత్తగా ఉండవలసిన సమయం ఇది. మరొక 30 రోజులపాటు అందరూ జాగ్రతగా ఉండాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను అప్రమత్తం చేస్తున్నాయి.