Homeటాప్ స్టోరీస్క‌రోనా ఎఫెక్ట్: `షోలే` బ‌న్‌గ‌యా `ధోలే`

క‌రోనా ఎఫెక్ట్: `షోలే` బ‌న్‌గ‌యా `ధోలే`

క‌రోనా ఎఫెక్ట్: `షోలే` బ‌న్‌గ‌యా `ధోలే`
క‌రోనా ఎఫెక్ట్: `షోలే` బ‌న్‌గ‌యా `ధోలే`

ప్ర‌పంచం మొత్తం ఇప్పుడు క‌రోనా వైర‌స్ కార‌ణంగా భ‌యంతో వ‌ణికిపోతోంది. గ‌త రెండు నెల‌ల క్రితం ప్ర‌పంచ వ్యాప్తంగా రోడ్ల‌న్నీ సందు లేకుండా జనాల‌తో నిండిపోయి వుండేవి. కానీ ఇప్పుడా ప‌రిస్థితి లేదు. ఎక్క‌డ చూసిన ఖాళీ రోడ్లు.. మ‌నుషులు క‌నిపించ‌ని రెస్టారెంట్‌లు.. షాపింగ్ మాల్సే క‌నిపిస్తున్నాయి. ఇలాంటి వీడియోల‌తో ప్ర‌ముఖ అమెరిక‌న్ మీడియా డైలీ మెయిల్ ఏకంగా ఓ వీడియోనే చేసి సోష‌ల్ మీడియాలో వ‌దిలేసింది. అదిప్పుడు వాట్సాప్ గ్రూపుల్లో వైర‌ల్‌గా మారింది.

వ‌ర‌ల్డ్ ఈజ్ క్లోస్డ్‌.. గోటూ హోమ్ రీడ్ ఏ బుక్ అంటూ వీడియో ఎండింగ్‌లో స్లోగ‌న్స్ ని కూడా యాడ్ చేయ‌డంతో ఈ వీడియో వైరల్‌గా మారింది. ఇదిలా వుంటే రామ్‌గోపాల్‌వ‌ర్మ ట్విట్ట‌ర్‌లో క‌రోనా వార్త‌ల‌ని త‌న‌కు ఇష్టం వ‌చ్చిన‌ట్టు మార్చుకుని వాటిని సోష‌ల్ మీడియాలో వ‌ద‌ల‌డం మొద‌లుపెట్టాడు. `బాహుబ‌లి 2`ని క‌రోనా బీట్ చేసింద‌ని, ఆ సినిమా క్యూ లైన్‌ల‌ని మించి క‌రోనా వ‌ల్ల జ‌నాలు సూప‌ర్ మార్కెట్‌ల వ‌ద్ద క్యూ క‌డుతున్నారని చ‌మ‌త్క‌రించిన వ‌ర్మ తాజాగా మ‌రో మార్ఫింగ్ ఫొటోని అప్‌డేట్ చేశాడు.

- Advertisement -

క‌రోనా రాకుండా జాగ్ర‌త్త‌లు తీసుకోవాలంటే చేతులు బాగా క‌డుక్కోవాల‌ని అంతా చెబుతున్న విష‌యం తెలిసిందే. దాన్నే తీసుకుని వ‌ర్మ `షోలే` సినిమా టైటిల్‌కు ఆపాదించాడు. ఇండియ‌న్ తెర‌పై సంచ‌ల‌నం సృష్టించిన `షోలే` చిత్ర పోస్ట‌ర్‌ని `ధోలే`గా మార్చి.. ఇక‌పై ఇలాంటి పోస్ట‌ర్‌లు చూడాలేమో అని ట్వీట్ చేశాడు. వైర‌స్ ఇలాగే ప్ర‌పంచాన్ని క‌మ్మేసి ఎక్కువ కాలం వుంటే రానున్న రోజుల్లో ఇలాంటి పోస్ట‌ర్‌ల‌ని చూస్తామేమో అని ట్వీట్ చేయ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All