హీరోయిన్ నిధి సుబ్బయ్య ఫోటో కన్నడ చిత్ర పరిశ్రమలో వివాదాన్ని రాజేసింది . శాండల్ వుడ్ నటి అయిన నిధి సుబ్బయ్య తాజాగా మైసూర్ ప్యాలెస్ లోని నిషేదిత ప్రాంతంలో ఫోటో దిగింది, దాంతో వివాదం మొదలయ్యింది . గతకొంత కాలంగా మైసూర్ ప్యాలెస్ లోని దర్భార్ హాల్లో ఫోటోలను తీయడం నిషేధించారు , అయితే అక్కడే కొద్దిసేపు సేదతీరిన నిధి సుబ్బయ్య ఫోటో దిగింది ఇంకేముంది ఆ ఫోటో ని సోషల్ మీడియాలో పెట్టడంతో నెటిజన్లు ఫైర్ అవుతున్నారు . నిషేదిత ప్రాంతం అంటారు అలాంటిది హీరోయిన్ నిధి కి ఫోటో దిగడానికి , ఫోటో షూట్ చేయడానికి అనుమతి ఎలా ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు .
అయితే నేను ఎలాంటి తప్పు చేయలేదని , అందరి వీక్షకుల లాగే నేను కూడా కామన్ ఫోటో దిగాను కానీ అక్కడ ఫోటో షూట్ ఏమి చేయలేదు అంటూ గట్టిగానే చెబుతోంది . ఇక మైసూర్ ప్యాలెస్ అధికారులు కూడా అది నిషేదిత స్థలం కాదని కాకపోతే దసరా ఉత్సవాల సమయంలో మాత్రమే అక్కడకు ఎవరినీ రాకుండా నిషేధం విధిస్తామని , అంతేకాని మిగతా సమయాల్లో మామూలుగానే ఉంటుందని భద్రతా అధికారి చెప్పారు . మామూలుగా దిగిన ఫోటో వివాదం కావడంతో కొంత బాధపడినప్పటికీ ఈ రకంగానైనా పబ్లిసిటీ లభించినందుకు సంతోషపడుతోంది నిధి సుబ్బయ్య .
English Title: controversy on actress nidhi subbaiah photoshoot