Homeటాప్ స్టోరీస్హీరోయిన్ ఓవియా ని అరెస్ట్ చేస్తారా ?

హీరోయిన్ ఓవియా ని అరెస్ట్ చేస్తారా ?

Controversy on 90 ML movie and Oviya 90 ఎం ఎల్ అనే తమిళ చిత్రంలో మహిళలను కించపరిచేలా పలు సన్నివేశాలు ఉన్నాయని , అందుకే హీరోయిన్ ఓవియా ని అరెస్ట్ చేయాలనీ చెన్నై పోలీస్ కమీషనర్ కు ఫిర్యాదు చేసారు . దాంతో ఓవియా ని అరెస్ట్ చేస్తారా ? అన్న చర్చ జరుగుతోంది . అంతేకాదు తక్షణమే ఓవియా ని అలాగే ఆ సినిమాని తెరకెక్కించిన దర్శకురాలు అనితా ఉదీప్ ని అరెస్ట్ చేయాలంటూ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు .

 

- Advertisement -

ఓవియా ఓ మహిళ , అలాగే 90 ఎం ఎల్ చిత్ర దర్శకురాలు కూడా ఓ మహిళ అలాంటిది ఇద్దరు ఆడవాళ్లు కలిసి భారతీయ సంకృతి , సంప్రదాయాలను పాతిపెట్టేలా ఓ అసభ్యకరమైన సినిమా ఎలా చేసారాని మండిపడుతున్నారు . విచ్చలవిడిగా శృంగార సన్నివేశాలు , సహజీవనం , మద్యం ,ఇతరత్రా చెడు అలవాట్లు మహిళా సాధికారతకు ఎలా నిదర్శనంగా నిలుస్తాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు . ఇలాంటి సినిమాల వల్ల భావితరాల వాళ్ళు పూర్తిగా చెడిపోతారని అందుకే ఓవియా ని అరెస్ట్ చేయాలంటూ ఆందోళన చేస్తున్నారు . అయితే ఈ ఆందోళనల వల్ల 90 ఎం ఎల్ చిత్రానికి ఇంకా వసూళ్లు పెరుగుతున్నాయి , తమిళ సినిమాని పక్కన పెడితే ఇదే చిత్రాన్ని తెలుగులో డబ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు .

English Title: Controversy on 90 ML movie and Oviya

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All