Homeటాప్ స్టోరీస్మహానటి లో ఆ సీన్స్ ఉంటే విమర్శలు వచ్చేవి

మహానటి లో ఆ సీన్స్ ఉంటే విమర్శలు వచ్చేవి

 controversial scene deleted in mahanati మహానటి సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే . వైజయంతి మూవీస్ పతాకంపై తెరకెక్కిన ఈ చిత్రంలో కీర్తి సురేష్ మహానటి గా జీవించింది అనడంలో ఎలాంటి సందేహం లేదు . విమర్శకుల ప్రశంసలతో పాటుగా భారీగా వసూళ్ల ని కూడా సాధించిపెట్టింది మహానటి చిత్రం . అయితే సావిత్రి బయోపిక్ అంటే మూడు గంటల్లో సరిపోదు కాబట్టి కొన్ని సన్నివేశాలు ఎక్కువే చిత్రీకరించారు కానీ….. ఎడిటింగ్ సమయంలో కొన్ని విడుదల సమయంలో కొన్ని సన్నివేశాలను కట్ చేసారు .

ఇటీవల అలా సినిమాలోనుండి తొలగించిన సన్నివేశాలను యు ట్యూబ్ లో విడుదల చేసారు ఆ చిత్ర బృందం . అందులో కొన్ని సన్నివేశాలు ప్రేక్షకులను అలరిస్తున్నాయి కాగా ఓ మూడు నిమిషాల నిడివి ఉన్న సీన్ మాత్రం సినిమాలో ఉంటే ఖచ్చితంగా వివాదాస్పదం అయ్యుండేది ! ఇంతకీ ఆ సీన్ ఏంటో తెలుసా …… జెమిని గణేశన్ పుష్పవల్లి ని అలాగే ఆమె కూతుర్లని నిర్లక్ష్యం చేసాడని , అప్పుడు సావిత్రి జెమిని కి నచ్చజెప్పి వాళ్ళని కూడా మంచిగా చూసుకోమని సలహా ఇవ్వడమే కాకుండా తన ఇంట్లోకి తీసుకువచ్చి బొమ్మలకొలువు పండగ చేయించినట్లు చూపించారు . పుష్పవల్లి పెద్ద కూతురే బాలీవుడ్ హీరోయిన్ రేఖ దాంతో చాలా విమర్శలు వచ్చేవి ! జెమిని గణేశన్ నిర్లక్ష్యం చేస్తే సావిత్రి వాళ్ళని ఆదరించినట్లుగా చూపిస్తూ ఆమె లోని గొప్పతనానికి నిదర్శనంగా చూపించాలని భావించాడు దర్శకుడు నాగ్ అశ్విన్ అయితే ఆ సీన్ ఉంటే పెద్ద ఎత్తున విమర్శలు వస్తాయని తెలిసి కాబోలు దాన్ని తొలగించారు . కట్ చేస్తే ఇప్పుడు యు ట్యూబ్ లో దర్శనం ఇస్తోంది .

YouTube video
- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All