Homeటాప్ స్టోరీస్ఆ కుట్ర నిజమేనా !

ఆ కుట్ర నిజమేనా !

conspiracy on chandrababu naiduఆంధ్రప్రదేశ్ లో నారా చంద్రబాబు నాయుడి ని ఓడించి ఇంటి పట్టున కూర్చోబెట్టాలని కంకణం కట్టుకున్నారు కొంతమంది , తెరవెనుక పెద్ద కుట్ర జరుగుతోంది అనడానికి తాజాగా పవన్ కళ్యాణ్ ప్రకటించిన 175 అసెంబ్లీ స్థానాల్లో జనసేన పోటీ అనే మాటే తార్కాణం . ఆంధ్రప్రదేశ్ లో 175 అసెంబ్లీ స్థానాలతో పాటుగా 25 పార్లమెంట్ స్థానాలు కూడా ఉన్నాయి . కానీ జనసేన 175 అసెంబ్లీ స్థానాల్లో మాత్రమే పోటీ చేస్తుందని స్పష్టంగా ప్రకటించింది అంటే పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేయరా ? లేక ఆ పార్లమెంట్ స్థానాల్లో పవన్ కళ్యాణ్ మద్దతుతో బీజేపీ పోటీ చేస్తుందా ? అన్నది ఇప్పుడు చర్చ గా మారింది .

గత ఎన్నికల్లో అవినీతిపరుడైన జగన్ అందలం ఎక్కితే ఆంధ్రప్రదేశ్ కు పుట్టగతులుండవు , అనుభవజ్ఞుడైన చంద్రబాబు అయితేనే ఆంధ్రప్రదేశ్ కు మంచిదని తెలుగుదేశం పార్టీ కి మద్దతు ప్రకటించాడు పవన్ కానీ గత ఆరు నెలలుగా పవన్ కళ్యాణ్ పంథా మార్చాడు . తెలుగుదేశం పార్టీ ని చీల్చిచెండాడుతున్నాడు . దాంతో తెరవెనుక బిజెపి పవన్ కళ్యాణ్ చేత డ్రామా ఆడిస్తోందని విమర్శలు చేస్తున్నారు తెలుగుదేశం నాయకులు , అయితే వాళ్ళ ఆరోపణలకు తగ్గట్లుగా పవన్ కళ్యాణ్ విమర్శలు కూడా నిజమే అనిపిస్తోంది . ప్రత్యేక హోదా విషయంలో జగన్ తిట్టినా , పవన్ తిట్టినా చంద్రబాబు ని మాత్రమే టార్గెట్ చేస్తున్నారు కానీ మోడి ని పల్లెత్తు మాట కూడా అనడం లేదు దాంతో చంద్రబాబు ని ఓడించడానికి 2019 ఎన్నికల్లో తెరవెనుక పెద్ద మంత్రాంగం నడుస్తున్నట్లు అర్ధం అవుతోంది . 175 స్థానాల్లో పోటీ చేసినప్పుడు 25 పార్లమెంట్ స్థానాలకు కూడా పోటీ చేయాలి కదా !

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All