Homeటాప్ స్టోరీస్నాపేరు సూర్య నా ఇల్లు ఇండియా చిత్రంపై కుట్రనా

నాపేరు సూర్య నా ఇల్లు ఇండియా చిత్రంపై కుట్రనా

conspiracy on Allu Arjun’s Naa Peru Surya naa illu india : allu aravindఅల్లు అర్జున్ నటించిన నాపేరు సూర్య నా ఇల్లు ఇండియా చిత్రంపై కొంతమంది కుట్ర పన్నారని అయితే ఎవరు ఎంతగా కుట్ర చేసినా ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడం ఖాయమని , ఈ సినిమా విజయోత్సవ వేడుకలో ఇంకా వివరంగా మాట్లాడతానని సంచలన వ్యాఖ్యలు చేసాడు అగ్ర నిర్మాత అల్లు అరవింద్ . గతకొంత కాలంగా తెలుగుచిత్ర పరిశ్రమలో శ్రీరెడ్డి వివాదంతో గందరగోళం నెలకొన్న విషయం తెలిసిందే . నెలరోజులుగా శ్రీరెడ్డి వివాదం ఇంకా భగ్గున మండుతూనే ఉంది .

అయితే మెగా కుటుంబాన్ని కొంతమంది కావాలని టార్గెట్ చేసారు కాబట్టి అందులో భాగంగా అల్లు అర్జున్ నటించిన నాపేరు సూర్య నా ఇల్లు ఇండియా చిత్రం సరిగ్గా లేదని , ప్లాప్ అనో లేక యావరేజ్ అనో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తారని కానీ వాళ్ళ పప్పులు ఉదకవని ఎందుకంటే సినిమా బాగుంటే ….. ప్రేక్షకులకు నచ్చితే ఎంతగా దుష్ప్రచారం చేసినా ప్రేక్షకులు బ్రహ్మరధం పట్టిన దాఖలాలు అనేకం ఉన్నాయని అన్నారు . ఎవరు ఎంతగా కుట్ర చేసినా మెగా ఫ్యాన్స్ వారి కుట్రలను తిప్పి కొట్టాలని , మళ్ళీ మనం సక్సెస్ మీట్ లో కలుద్దాం అంటూ ముగించాడు అల్లు అరవింద్ . ఇన్నాళ్లు మెగా అభిమానుల మధ్య గోడలు ఉండేవి ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకునేవాళ్ళు కట్ చేస్తే శ్రీరెడ్డి వివాదంతో మెగా కాంపౌండ్ అంతా ఒక్కటయ్యింది . మరి ఈ కుట్ర నిజమే అయితే దాన్ని ఎలా తిప్పి కొడతారో చూడాలి .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All