Sunday, November 27, 2022
Homeటాప్ స్టోరీస్క్రిస్మస్ రిలీజులపై ఈ కన్ఫ్యూజన్ ఏంటి?

క్రిస్మస్ రిలీజులపై ఈ కన్ఫ్యూజన్ ఏంటి?

క్రిస్మస్ రిలీజులపై ఈ కన్ఫ్యూజన్ ఏంటి?
క్రిస్మస్ రిలీజులపై ఈ కన్ఫ్యూజన్ ఏంటి?

దసరా సీజన్ ముగియడంతో ఇక దృష్టి అంతా సంక్రాంతి సీజన్ పై పడింది. సంక్రాంతికి ఇప్పటికే నాలుగు చిత్రాలు రిలీజ్ డేట్ ను కన్ఫర్మ్ చేసుకోగా వెంకీ మామ మాత్రం అటా ఇటా అని ఊగుతోంది. రెండు మూడు రోజుల్లో ఈ కన్ఫ్యూజన్ కు తెరపడనుంది. అయితే సంక్రాంతి కంటే ముందు క్రిస్మస్ సీజన్ కూడా టాలీవుడ్ కు ముఖ్యమే. గత కొన్నేళ్ల నుండి క్రిస్మస్ కు మీడియం రేంజ్ చిత్రాలు రెండు, మూడు విడుదలై విజయాలు కూడా సాధిస్తున్నాయి.

- Advertisement -

ఈసారి కూడా మీడియం రేంజ్ హీరోలు క్రిస్మస్ సీజన్ పై కన్నేశారు. అటు సంక్రాంతికి రాలేని వీరు మాములు వీకెండ్ లో విడుదల చేసుకునే కంటే క్రిస్మస్ వీకెండ్ అయితే బెటర్ అని భావిస్తున్నారు. అందుకే ఈసారి ఆరు సినిమాలకు పైగా మొదట క్రిస్మస్ కు ప్లాన్ చేస్తున్నట్లు ఫీలర్లు అందాయి. కానీ వీటిలో ఇప్పుడు మెజారిటీ చిత్రాలు వెనక్కి తగ్గుతున్నాయి.

నితిన్ – వెంకీ కుడుముల దర్శకత్వంలో రానున్న భీష్మ ఇప్పటికే క్రిస్మస్ రేసు నుండి వెనక్కి తగ్గింది. రవితేజ – విఐ ఆనంద్ దర్శకత్వంలో రానున్న డిస్కో రాజా చిత్రానికి ఇంకా విఎఫ్ఎక్స్ వర్క్ పనులు బ్యాలెన్స్ ఉండడంతో ఆ సమయానికి రావడం అవుతుందా అన్న సందేహాలు ఉన్నాయి. బాలయ్య కూడా తన సినిమాను డిసెంబర్ లో విడుదల చేయడం కష్టమనే భావిస్తున్నాడు. ఇలా ఒక్కొక్క సినిమా వెనక్కి తగ్గుతుండడంతో అసలు క్రిస్మస్ కు ఎవరు వస్తారు ఎవరు రారు అనే కన్ఫ్యూజన్ నెలకొంది.

Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All

గాసిప్స్

View All

Latest Posts