Homeటాప్ స్టోరీస్`ఎఫ్ 3` పోస్ట‌ర్ టాక్‌: మ‌నీతో వ‌చ్చే ఫ్ర‌స్ట్రేష‌న్ ఫ‌న్‌!

`ఎఫ్ 3` పోస్ట‌ర్ టాక్‌: మ‌నీతో వ‌చ్చే ఫ్ర‌స్ట్రేష‌న్ ఫ‌న్‌!

`ఎఫ్ 3` పోస్ట‌ర్ టాక్‌: మ‌నీతో వ‌చ్చే ఫ్ర‌స్ట్రేష‌న్ ఫ‌న్‌!
`ఎఫ్ 3` పోస్ట‌ర్ టాక్‌: మ‌నీతో వ‌చ్చే ఫ్ర‌స్ట్రేష‌న్ ఫ‌న్‌!

విక్ట‌రీ వెంక‌టేష్‌, వ‌రుణ్‌తేజ్ హీరోలుగా న‌టించిన బ్లాక్ బ‌స్ట‌ర్ `ఎఫ్‌2`. అనిల్ రావిపూడి తెర‌కెక్కించిన ఈ మూవీ అనూహ్య విజ‌యాన్ని సాధించి వంద కోట్ల క్ల‌బ్‌లో చేరింది.  క‌లెక్ష‌న్‌ల ప‌రంగా ట్రేడ్ వ‌ర్గాల‌నే విస్మ‌యానికి గురిచేసింది. ఫ్యామిలీ ఎమోష‌న్స్‌కి ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ని చిన్న పాటి సందేశాన్ని జోడించి అనిల్ రావిపూడి చేసిన ప్ర‌య‌త్నం.. వెంకీ క్యారెక్ట‌రైజేష‌న్ ఈ మూవీని బాక్సాఫీస్ వ‌ద్ద‌ బ్లాక్ బ‌స్ట‌ర్‌గా నిల‌బెట్టాయి.

ప్ర‌స్తుతం ఈ మూవీకి సీక్వెల్ గా `ఎఫ్‌3`ని రూపొందిస్తున్నారు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సీక్వెల్‌లో విక్ట‌రీ వెంక‌టేష్‌, వ‌రుణ్‌తేజ్ న‌టిస్తున్నారు. వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి నుంచి ఈ మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఆదివారం విక్ట‌రీ వెంక‌టేష్ పుట్టిన రోజు సంద‌ర్భంగా చిత్ర బృందం `ఎఫ్‌3` ఫ‌స్ట్ లుక్ కాన్సెప్ట్ పోస్ట‌ర్‌ని రిలీజ్ చేశారు. ఈ ద‌ఫా డ‌బ్బుల‌తో పుట్టే ఫ‌న్ అండ్ ఫ్ర‌స్ట్రేష‌న్ నేప‌థ్యంలో సినిమా సాగుతుంద‌ని తెలుస్తోంది.

- Advertisement -

డ‌బ్బు క‌ట్ట‌లు పోగేసుకుని వెంక‌టేష్‌, వ‌రుణ్‌తేజ్ ప‌రుగులు తీస్తున్న తీరు ఆక‌ట్టుకుంటోంది. అయితే ఇది సీక్వెల్ క‌థ కాద‌ని కొత్త క‌థ‌తో ఈ మూవీని చేస్తున్న‌ట్టు ఇప్ప‌టికే ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి ప్ర‌క‌టించ‌డంతో ఈ మూవీలో ఫ‌స‌న్ ఎలా ఏ స్థాయిలో వుండ‌నుంద‌న్న‌ది ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. ఎఫ్‌2ని మించి ఆద్యంతం వినోదాత్మ‌కంగా ఈ మూవీని తెర‌పైకి తీసుకురానున్నార‌ట‌.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All