Homeటాప్ స్టోరీస్రెండు సినిమాలలో కామన్ గా ఉన్న ఫిలాసఫీ

రెండు సినిమాలలో కామన్ గా ఉన్న ఫిలాసఫీ

రెండు సినిమాలలో కామన్ గా ఉన్న  ఫిలాసఫీ
రెండు సినిమాలలో కామన్ గా ఉన్న ఫిలాసఫీ

కొన్ని కొన్ని సార్లు రిలీజయ్యే సినిమాలలో స్క్రీన్ ప్లే అంశాలు కొంచెం దగ్గరగా ఉంటాయి. అది పెద్ద తప్పు కాదు. ఇప్పుడు ఆ మేకర్స్ ని విమర్శించే ఉద్దేశం కూడా మనకి లేదు కానీ… వరుసగా రిలీజ్ అయిన రెండు సినిమాలలో కామన్ పాయింట్స్ ను అబ్జర్వ్ చేసే సినిమా లవర్స్ ఇలాంటి విషయాలన్నీ గమనిస్తూ ఉంటారు. సాధారణంగా పెద్ద సినిమాలలో పనిచేసే ఆర్టిస్ట్ లు మరియు టెక్నీషియన్లు, పోటీగా రిలీజ్ అయ్యే మరొక సినిమాలో కూడా నటించడం లేదా పనిచేయటం చాలా సాధారణమైన విషయం. ఈ సంక్రాంతికి రిలీజ్ అయిన అల వైకుంఠపురం లో మరియు సరిలేరు నీకెవ్వరు సినిమా లో ఒక పాయింట్ కామన్ గా ఉంటుంది. అది ఏమిటి అంటే, తప్పు – ఒప్పు ఫిలాసఫీ. సరిలేరు నీకెవ్వరు సినిమాలో విజయశాంతి పాత్రను ఎస్టాబ్లిష్ చేసే ఉద్దేశ్యంలో భాగంగా ఒక డైలాగ్ ఉంటుంది. “ఒక లెక్చరర్ గా నా జీవితంలో ఇప్పటివరకు ఈ తప్పుని రైట్ కొట్టలేదు” అని, అదేవిధంగా ప్రతి నాయకుడు పాత్ర చేసిన ప్రకాష్ రాజు కూడా తన క్యారెక్టర్ గురించి తెలియ చేస్తూ, “నేనెప్పుడూ తప్పే చేస్తాను రెడ్డి…. దాన్ని ఎవ్వడు రైట్ కొట్టిన నాకు నచ్చదు.”అని చెప్తాడు.

ఎదుటివాడు తప్పు చేసినప్పుడు దాన్ని కరెక్ట్ అని ఒప్పుకోకపోవడం ; చేసేది తప్పు అని తెలిసినా తనకు నచ్చింది కాబట్టి చేస్తాను అనే అహంకారం ప్రదర్శించటం ఈ పాత్రల లక్షణాలు. అదేవిధంగా మరొక సినిమా అల వైకుంఠపురం లో కూడా ఇదే తప్పు, రైటు ఫిలాసఫీ మీద క్లైమాక్స్ లో కొన్ని డైలాగ్స్ ఉంటాయి.హీరో తన కొడుకు అనే విషయాన్ని చెప్దామని అతని తండ్రి ప్రయత్నం చేస్తుంటే హీరో వద్దు అంటాడు. పాతిక సంవత్సరాల క్రితం తెలియకుండా చేసిన తప్పు నీ ఇప్పుడు సరి చేయడం వల్ల కొత్తగా కలిగే ప్రయోజనాలు లేకపోగా ఉన్న అందరూ బాధ పడతారని, “మనం ఈ తప్పును కరెక్ట్ చేయొద్దని దీన్ని ఇలాగే ఉంచుదామని” హీరో అంటాడు. మనకు తెలిసి చేస్తే తప్పు; మనకు తెలియకుండా చేస్తే పొరపాటు; మనకు తెలిసిన కూడా మళ్ళీ మళ్ళీ చేస్తే అది పాపం.ఇలాంటి ఫిలాసఫీని ఒక సినిమా అనే మాధ్యమం ద్వారా ప్రజలకు అర్థమయ్యే విధంగా చెప్పాలని రచయితలు దర్శకులు ప్రయత్నం చేస్తూ ఉంటారు. తప్పు – ఒప్పు అనే ఫిలాసఫీ మీద ఇంకా ఈ మధ్య రిలీజ్ అయిన సినిమా లో కూడా చాలా ఉదాహరణలు ఉన్నాయి. అవి తర్వాత మాట్లాడుకుందాం.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All