Homeటాప్ స్టోరీస్`క‌మిట్‌మెంట్‌` టీజ‌ర్ టాక్‌: బోల్డ్ అండ్ రియ‌లిస్టిక్‌!

`క‌మిట్‌మెంట్‌` టీజ‌ర్ టాక్‌: బోల్డ్ అండ్ రియ‌లిస్టిక్‌!

`క‌మిట్‌మెంట్‌` టీజ‌ర్ టాక్‌: బోల్డ్ అండ్ రియ‌లిస్టిక్‌!
`క‌మిట్‌మెంట్‌` టీజ‌ర్ టాక్‌: బోల్డ్ అండ్ రియ‌లిస్టిక్‌!

తేజస్వి మ‌దివాడ, అన్వేషి జైన్, రమ్య పసుపులేటి, సిమార్ సింగ్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్న చిత్రం `క‌మిట్‌మెంట్‌`. ల‌క్ష్మీ కాంత్ చెన్న ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ మూవీకి సంబంధించిన టీజ‌ర్‌ని బుధ‌వారం చిత్ర బృందం రిలీజ్ చేసింది. బ‌ల్దేవ్ సింగ్‌, నీలిమ‌. టి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. క‌మిట్‌మెంట్ అనే పాయింట్ నేప‌థ్యంలో ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు.

`లైఫ్ పుట్టేదే సెక్స్ వ‌ల్ల అయిన‌ప్పుడు లైఫ్ ఇవ్వ‌డానికి సెక్స్ అడిగితే త‌ప్పేముంది? అని ఓ వ్య‌క్తి ప్ర‌శ్నించ‌డం .. ఆడ‌ది కన‌బ‌డితే కాంప్ర‌మైజ్‌లు క‌మిట్‌మెంట్‌లు త‌ప్ప ఇంకేమీ ఆలోచించ‌రా.. అంటూ తేజ‌స్వీ సీనియ‌స్‌గా నిల‌దీస్తున్న స‌న్నివేశాలు.. బోల్డ్ కంటెంట్‌.. లిప్ లాక్‌లు.. హాట్ బెడ్ రూమ్ సీన్‌ల‌తో క‌మిట్‌మెంట్ టీజ‌ర్ నిండిపోయింది. సినిమా ప్ర‌ధాన ఉద్దేశ్యం ఏంటో క్లారిటీగా టీజ‌ర్‌లో చెప్పేశారు. మ‌హిళ‌ల ప‌ట్ల స‌మాజం ఎలా వుందో బోల్డ్‌గా రియ‌లిస్టింగ్‌గా చూపించే ప్ర‌య‌త్నం చేశారు.

- Advertisement -

ప్రేమ పేరిట స్త్రీలు ఎలా దోపిడీకి గురి అవుతూ మోసపోతున్నారు. శారీర‌కంగా దోపిడీకి గుర‌వుతున్నార‌నే అంశం నేప‌థ్యంలో `క‌మిట్‌మెంట్‌` చిత్రాన్ని తెర‌కెక్కించారు. టీజ‌ర్‌లో నలుగురు పురుషులతో భయపెట్టే అనుభవాలన్న  నలుగురు మహిళల జీవితాలను ఆవిష్క‌రించారు. ఇండ‌స్ట్రీలో మీటూ ఉద్య‌మం ప్ర‌కంప‌న‌లు సృష్టించిన విష‌యం తెలిసిందే. ఇదే అంశంతో పాటు క‌మిట్‌మెంట్ అనేది సినీ ఇండ‌స్ట్రీలోనే కాకుండా ప్ర‌తీ రంగంలోనూ వుంద‌ని రాజార‌వీంద్ర పాత్ర ద్వారా చూపించే ప్ర‌య‌త్నం చేశారు. ఫుల్ బోల్డ్ కంటెంట్‌తో పాటు బోల్డ్ డైలాగ్‌ల‌తో నిండిపోయిన ఈ మూవీ ఇండ‌స్ట్రీలో ప్ర‌కంప‌న‌లు సృష్టించ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది.

 

View this post on Instagram

 

A post shared by Tejaswi Madivada (@tejaswimadivada)

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All