Homeటాప్ స్టోరీస్హాలీవుడ్ కి మరో తెలుగు నటుడు

హాలీవుడ్ కి మరో తెలుగు నటుడు

 హాలీవుడ్ కి మరో తెలుగు నటుడు
హాలీవుడ్ కి మరో తెలుగు నటుడు

ప్రపంచ సినిమా పరిశ్రమలో అందరూ ఆదర్శంగా తీసుకునే ఇండస్ట్రీ హాలీవుడ్. టెక్నాలజీ, ఆర్టిస్టులు, టేకింగ్, స్క్రీన్ ప్లే, సబ్జెక్టులు ఇలా హాలీవుడ్ ఇన్స్పిరేషన్ గా తీసుకొని మిగిలిన అందరూ సినిమాలు తీస్తూ ఉంటారు. చరిత్రలో చాలా అరుదుగా హాలీవుడ్ ఇండస్ట్రీ వాళ్లు కూడా ఇతర టాలెంట్ లను గుర్తించి వాళ్లను తమ సినిమాలలో నటింపచేసుకోవడమో లేదా టెక్నీషియన్ల తో పని చేయించుకోవడం చేస్తూ ఉంటారు. ఉదాహరణకు భారతదేశం నుంచి సాగరసంగమం, నాయకుడు, అభయ్, స్వర్ణ కమలం లాంటి సినిమాలు హాలీవుడ్ ఇండస్ట్రీ స్థాయికి వెళ్లి అక్కడ ఫిలిం మేకర్స్ ను కూడా ఆలోచింపజేశాయి. ఇక భారతీయ సినిమా తొలి రోజుల్లో భారతదేశం దిగ్గజ దర్శకుడు సత్యజిత్ రే తీసిన పథేర్ పాంచాలి సినిమా హాలీవుడ్ చాలా మంది దర్శకులకు ఒక పాఠం లాంటిది. ఇక మన తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి కూడా కొంత మంది నటీనటులు హాలీవుడ్ సినిమాలలో నటించి మెప్పించారు. ఉదాహరణకు తెలుగు సినిమా పరిశ్రమకు కళామతల్లి ఇచ్చిన ఒక వరం లాంటి నటుడు, నటకిరీటి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు హాలీవుడ్ ఇండస్ట్రీ తీసిన “క్విక్ గన్ మురుగన్” అనే సినిమాలో హీరోగా నటించారు. హాలీవుడ్ ఇండస్ట్రీలో డాక్టర్ రాజేంద్రప్రసాద్ గారికి ఉన్న గుర్తింపు గౌరవం అలాంటిది.

రాజేంద్ర ప్రసాద్ గారి తరహాలో మరొక హాస్య నటుడు హీరో డాక్టర్ అలీ ఇప్పుడు హాలీవుడ్ సినిమా తో అక్కడ తెరంగేట్రం చేయబోతున్నారు. ఇప్పటికే ఎన్నో సినిమాల్లో వైవిధ్యభరితమైన పాత్రలు పోషించి అటు నటుడిగా మరియు సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ అందరికీ ఆదర్శప్రాయుడు గా నిలుస్తున్న ఆలీ గారు, జగదీష్ దానేటి అనే ఒక భారతీయ యువ దర్శకుడు తెరకెక్కిస్తున్న సినిమా లో అలీ నటిస్తున్నారు. ఇక ఈ సినిమా పనుల నిమిత్తం ఇటీవలే కేంద్ర మంత్రి శ్రీ ప్రకాష్ జవదేకర్ గారితో అలీ గారు మరియు దర్శకుడు జగదీష్ సమావేశమై లొకేషన్ల పర్మిషన్ ల విషయం మాట్లాడారు. మార్టిన్ ఫిలిమ్స్ మరియు పింక్ జాగ్వర్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సినిమా రూపొందబోతోంది ఇక నటుడు అలీ గారి కెరీర్ లో ఈ సినిమా ఒక మైలురాయిగా నిలిచిపోతుందని అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఒక హాస్యనటుడిగా అలీ గారి క్రేజ్ ఇప్పటికే బాలీవుడ్ దాకా తాకింది. సల్మాన్ ఖాన్ నటించిన దబాంగ్ త్రీ సినిమా లో కానిస్టేబుల్ రాజు అనే పాత్రలో అలీ ఇప్పటికే బాలీవుడ్ ప్రేక్షకులను సైతం అలరించాడు. సీతాకోకచిలుక సినిమాతో నటుడిగా తన ప్రస్థానం మొదలుపెట్టిన అలిగారు ఇప్పుడు హాలీవుడ్ దాకా చేరుకోవడం ఒక తెలుగు సినిమా పరిశ్రమకు ఎంతో గర్వకారణమని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All