Homeటాప్ స్టోరీస్పెళ్లి చేసుకున్న కలర్స్ స్వాతి

పెళ్లి చేసుకున్న కలర్స్ స్వాతి

Colours Swathi married with Vikasకలర్స్ స్వాతి పెళ్లి ఎట్టకేలకు అయ్యింది . గతకొంత కాలంగా కలర్స్ స్వాతి ఓ యంగ్ హీరో ని ప్రేమిస్తోందని రకరకాల వార్తలు వచ్చిన విషయం తెలిసిందే అయితే ఆ వార్తలకు చెక్ పెడుతూ తాను ప్రేమిస్తున్న మలేషియన్ పైలట్ వికాస్ ని పెళ్లి చేసుకుంది . కొంతమంది సన్నిహితులు ఇరు కుటుంబాల బంధువులు తప్ప మిగతావాళ్ళని పెళ్లికి పిలవలేదు స్వాతి . అయితే రిసెప్షన్ మాత్రం అటు అబ్బాయ్ తరుపు వాళ్ళ కోసం కొచ్చి లో అలాగే స్వాతి తరుపు వాళ్ళ కోసం , టాలీవుడ్ కోసం హైదరాబాద్ లో ప్లాన్ చేస్తున్నారు .

చడీచప్పుడు కాకుండా స్వాతి పెళ్లి కావడంతో ఒకింత షాక్ అయ్యారు నెటిజన్లు . స్వాతి పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో రావడంతో వాటిని షేర్ చేస్తూ మిగతావాళ్లకు తెలిసేలా చేస్తున్నారు . బుల్లితెర యాంకర్ గా ప్రారంభమైన కలర్స్ స్వాతి కెరీర్ హీరోయిన్ స్థాయి వరకు వెళ్ళింది . తెలుగు చిత్రాల్లో మాత్రమే కాకుండా తమిళ చిత్రాల్లో కూడా నటించింది కలర్స్ స్వాతి . మొత్తానికి కోరుకున్న ప్రియుడిని పెళ్లి చేసుకున్న స్వాతి మలేషియాలో స్థిరపడుతుందా ? లేక హైదరాబాద్ లోనేనా ? అన్నది తేలాల్సి ఉంది .

- Advertisement -

English Title: colours swathi married with Vikas

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All