
కలర్స్ స్వాతి మళ్లీ రీఎంట్రీ ఇస్తోంది. గత కొంత కాలంగా వివాహానంతరం సినిమాలకు బ్రేకిచ్చిన స్వాతి మళ్లీ నటించడానికి రెడీ అవుతోంది. గత కొంత కాలంగా భర్త తో కలిసి ఇండోనేషియాలో వుంటున్న ఆమె ఇటీవలే హైదరాబాద్‌కు తన మకాం మార్చేసింది. సెకండ్ ఇన్నింగ్స్ లో భాగంగా `పంచతంత్రం` చిత్రంలో నటిస్తోంది.
`ఈ చిత్రం ఐదు ఇంద్రియాలలు, ఒక భావోద్వేగం నేపథ్యంలో సాగే సెన్సిబుల్ స్టోరీ ఇది` అని మేకర్స్ చెబుతున్నారు. స్వాతిరెడ్డితో పాటు నరేష్ అగస్త్యుడు, రాహుల్ విజయ్, శివాత్మిక రాజశేఖర్, దివ్య ద్రిష్టి, వికాస్, సముద్రఖని, బ్రహ్మానందం ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. విభిన్నమైన కథ, కథనాలతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. పాత్రల పరిచయానికి సంబంధించిన వీడియోని గురువారం హీరో అడివిశేష్ విడుదల చేశారు.
టిక్కెట్ ఫ్యాక్టరీ, ఎస్ ఒరిజినల్స్ బ్యానర్స్ పై అఖిలేష్ వర్ధన్, సృజన్ యెర్రబోలు సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఈ మూవీ ద్వారా హర్ష పులిపాక దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. సైలెంట్‌గా ఈ మూవీ షూటింగ్‌ని ఇప్పటికే చిత్ర బృందం పూర్తి చేసేసింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో వున్న ఈ మూవీని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఈ మూవీ ద్వారా కలర్స్ స్వాతీ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తోంది. `లండన్ బాబులు` తరువాత కలర్స్ స్వాతి నటిస్తున్న సినిమా ఇదే కావడం విశేషం.