
అప్పటివరకు చిన్న చిన్న పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న సుహాస్ ..కలర్ ఫోటో మూవీ తో హీరోగా మారాడు. కరోనా టైం లో ఆహా ఓటిటి లో రిలీజ్ అయినా ఈ మూవీ ప్రేక్షకులను ఎంతగానో మెప్పించింది. సుహాస్ లో ఈ రేంజ్ యాక్టర్ ఉన్నాడా అని అంత ఆశ్చర్య పోయారు. సుహాస్ నటన గురించి సోషల్ మీడియా లో పెద్ద ఎత్తున సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపించారు. తాజాగా సుహాస్ ఫై మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు కురిపించడం..అది కూడా పబ్లిక్ వేదిక ఫై తన గురించి గొప్పగా చిరంజీవి చెపుతుండడం తో కంటతడి పెట్టుకున్నాడు సుహాస్.
తాప్సి ప్రధాన పాత్రలో మిషన్ ఇంపాజిబుల్ అనే మూవీ తెరకెక్కింది. ఏప్రిల్ 01 న ఈ మూవీ రిలీజ్ కాబోతుంది. ప్రముఖ నిర్మాణ సంస్థ మ్యాట్నీ ఎంటర్ టైన్మెంట్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ ఫేమ్ టాలెంటెడ్ డైరెక్టర్ స్వరూప్ ఆర్ఎస్జే ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ప్రమోషన్ లలో భాగంగా నిన్న ఈ మూవీ ప్రీ రిలీజ్ వేడుకను అట్టహాసంగా జరిపారు. ఈ వేడుకకు ముఖ్య అతిధిగా చిరంజీవి హాజరయ్యారు.
ఈ సందర్బంగా చిరంజీవి మాట్లాడుతూ.. కరోనా పాండమిక్ వలన ఓటీటీలో వరుసగా సినిమాలన్నింటిని చూశాను. అలా చూస్తూ కలర్ ఫోటో సినిమాను చూశాను. అందులో సుహాస్ నటన ఎంతగానో నచ్చిందని..సుహాస్ తో పాటు అంత ఎంతో బాగా నటించారు. సినిమా బాగుందంటూ ప్రశంసలు కురిపించారు. చిరంజీవి తన సినిమా గురించి మాట్లాడంతో హీరో సుహాస్ ఎమోషనల్ అయ్యాడు.