
ఏ విషయాన్నైనా కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడే దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ. ఇటీవల పలాస 1978` సినిమా దళితుల కోసం తీస్తే ఎవరూ చూడటం లేదని సంచలన వ్యాఖ్యలు చేసిన ఆయన తాజాగా మరో సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు. మోహన్‌కృష్ణ బెల్లంకొండ, రేఖ నిరోషా హీరో హీరోయిన్‌లుగా రూపొందిన రొమాంటిక్ లవ్‌స్టోరీతో అశోక్ వర్మ రూపొందించిన లఘు చిత్రం `క్లియోపాత్ర`.
శ్రీనివాస్ వడుపు, రణధీర్ వైట్ల, బాపిరాజు లంకె సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రాన్ని ప్రత్యేకంగా వీక్షించిన తమ్మారెడ్డి భరద్వాజ, సంగీత దర్శకురాలు ఎం.ఎం. శ్రీలేఖ, నిర్మాత సంజయ్‌రెడ్డి చిత్రబృందాన్ని ప్రశంసించారు. ఇలాంటి విభిన్నమైన కథల్ని తెరపైకి తీసుకురావడం కష్టమని, అలాంటి కష్టమైన సామసాన్ని చేసినందుకు చిత్ర బృందాన్ని అభినందించారు.
తమ్మారెడ్డి భరద్వాజ ప్రశంసలు కురిపించారు. కాంప్లికేటెడ్ పాయింట్‌ని తీసుకుని ప్రేమకథని తెరకెక్కించి మెప్పించడం అనేది చాలా కష్టం. దర్శకుడు అశోక్‌వర్మ ఈ విషయంలో నూటికి నూరు శాతం సక్సెస్ సాధించాడని కొనియాడారు. తొలి ప్రయత్నంలోనే ఈ స్థాయిలో రూపొందించడం మామూలు విషయం కాదని, ఇది హర్షంచదగిన విషయమని ప్రశంసించారు.