
నందమూరి బాలకృష్ణ రీసెంట్ గా అఖండ తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. బోయపాటి శ్రీను డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. ప్రస్తుతం గోపీచంద్ మలినేని డైరెక్షన్లో తన 107 మూవీ చేస్తున్నాడు. శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుండగా..థమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.
ఇదిలా ఉంటె బాలకృష్ణ గత కొద్దీ రోజులుగా మోకాలి నొప్పి తో బాధపడుతున్నాడని, ఈ నొప్పి తీవ్రం కావడం తో సర్జరీ చేయించుకున్నాడని , ప్రస్తుతం అయన ఆరోగ్యం బాగానే ఉన్నాడని, కొన్ని రోజులు రెస్ట్ తీసుకుంటే సరిపోతుందనే వార్తలు సోషల్ మీడియా లో వైరల్ కావడం తో అభిమానులంతా కాస్త ఖంగారుకు లోనవుతున్నారు. అయితే ఈ వార్తల్లో ఏమాత్రం నిజం లేదని బాలయ్య PRO టీం తెలిపింది.
నటసింహం నందమూరి బాలకృష్ణ గారికి ఎటువంటి సర్జరీ జరగలేదు, ఆయన కేవలం రెగ్యులర్ చెకప్ కొరకు మాత్రమే హాస్పిటల్ కి వెళ్లడం జరిగింది. ఈ రోజు ఆయన సారధి స్టూడియోస్ లో #NBK107 షూటింగ్ లో పాల్గొన్నారు. దయ చేసి అవాస్తవాలను ప్రచురించవద్దు, వ్యాప్తి చేయవద్దు అంటూ తెలిపారు.