Homeన్యూస్'హరికథ' ఫస్ట్ లుక్ పోస్టర్ ని విడుదల చేసిన సినిమాటోగ్రఫీ మినిస్టర్ తలసాని శ్రీనివాస్ యాదవ్

‘హరికథ’ ఫస్ట్ లుక్ పోస్టర్ ని విడుదల చేసిన సినిమాటోగ్రఫీ మినిస్టర్ తలసాని శ్రీనివాస్ యాదవ్

Cinematography Minister Talasani Srinivas Yadav released the first look poster of 'Harikatha'
Cinematography Minister Talasani Srinivas Yadav released the first look poster of ‘Harikatha’

కిరణ్, రంజిత్, సజ్జన్, అఖిల్ రామ్, లావణ్య రెడ్డి, కీర్తి ప్రధాన పాత్రలలో తెరకెక్కుతున్న చిత్రం ‘హరికథ’. ఐరావత సినీ కలర్స్ బ్యానర్ పై రంజిత్ కుమార్ గౌడ్, వివేకా నంద, రఘు , కవిత సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించగా అనుదీప్ రెడ్డి దర్శకత్వం వహించారు. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను సినిమాటోగ్రఫీ మినిస్టర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ విడుదల చేసి చిత్ర యూనిట్ కి అభినందనలు తెలిపారు. ఈ చిత్రానికి కెమెరామెన్ గా మస్తాన్ షరీఫ్ వ్యవహరించగా బొంతల నాగేశ్వర్ రెడ్డి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించారు. మహావీర్ సంగీతం సమకూర్చారు. త్వరలోనే నిర్మాణాంతర పనులు పూర్తి చేసుకొని విడుదల తేదీని ప్రకటించనున్నారు.

Cinematography Minister Talasani Srinivas Yadav released the first look poster of 'Harikatha'
Harikatha First Look Poster

ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు అనుదీప్ రెడ్డి మాట్లాడుతూ.. హరికథ సినిమా వినూత్నమైన సినిమా. అన్ని వర్గాలకు నచ్చే కుటుంబ, ప్రేమ కథా చిత్రం. ఎక్కడా రాజీ పడకుండా అందరికీ నచ్చేలా తీర్చిదిద్దిన సినిమా ఇది. మా సినిమా కి సపోర్ట్ చేసిన అందరికి కృతజ్ఞతలు. ఫస్ట్ లుక్ పోస్టర్ ని విడుదల చేసిన సినిమాటోగ్రఫీ మినిస్టర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు అని తెలిపారు.

- Advertisement -

చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ.. దర్శకుడు చెప్పిన కథ  బాగా నచ్చి ఈ సినిమా చేయడం జరిగింది. కుటుంబ సమేతంగా చూడదగ్గ అంశాలన్నీ ఈ చిత్రం లో ఉంటాయి. దర్శకుడు కథ చెప్పిన విధంగానే చిత్రం చాలా బాగా వచ్చింది. నటీనటులందరూ ఎంతో బాగా నటించారు. త్వరలోనే మంచి విడుదల తేదీ తో ప్రేక్షకుల  ముందుకు వస్తాం. మా సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసిన సినిమాటోగ్రఫీ మినిస్టర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి కృతజ్ఞతలు తెలిపారు.

నటీనటులు : కిరణ్, రంజిత్, సజ్జన్, అఖిల్ రామ్, లావణ్య రెడ్డి, కీర్తి

సాంకేతిక నిపుణులు :

బ్యానర్ : ఐరావత సినీ కల్చర్
నిర్మాతలు : రంజిత్ కుమార్ గౌడ్, వివేకా నంద, రఘు , కవిత
దర్శకుడు : అనుదీప్ రెడ్డి
సంగీతం : మహావీర్
సినిమాటోగ్రఫర్ : మస్తాన్ షరీఫ్
ఎడిటర్ : బొంతల నాగేశ్వర్ రెడ్డి ఎ
పి ఆర్ ఓ : సాయి సతీష్, పర్వతనేని రాంబాబు

Cinematography Minister Talasani Srinivas Yadav released the first look poster of 'Harikatha'
Cinematography Minister Talasani Srinivas Yadav released the first look poster of ‘Harikatha’
- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All