
చిన్న తనంలోనే చిత్రసీమలో అడుగుపెట్టి బాల నటుడి గా ప్రేక్షకులను మెప్పించిన పూరి తనయుడు ఆకాష్ పూరీ..ప్రస్తుతం హీరోగా వరుస సినిమాలు చేస్తున్నాడు. ఈ మధ్యనే రొమాంటిక్ మూవీ తో ఆకట్టుకున్న ఆకాష్..త్వరలో చోర్ బజార్ మూవీ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
‘దళం’, ‘జార్జ్ రెడ్డి’ చిత్రాలతో తనదైన మార్క్ క్రియేట్ చేసుకున్కన జీవన్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. లవ్, యాక్షన్ ఎంటర్ టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఐ.వి ప్రొడక్షన్స్ పతాకంపై వీ.ఎస్ రాజు నిర్మిస్తున్నారు. తాజాగా ప్రమోషన్ లో భాగంగా శనివారం సినిమాలోని ‘అబ్బబ్బా ఇది ఏం పోరి’ అంటూ సాగే లిరికల్ సాంగ్ విడుదల చేశారు. సురేష్ బొబ్బిలి సంగీత సారథ్యంలో రామ్ మిర్యాల అద్భుతంగా ఆలపించారు. మిట్టపల్లి సురేందర్ సాహిత్యం అందించారు. భాను మాస్టర్ కొరియోగ్రఫీ అందించారు.