Homeటాప్ స్టోరీస్చిత్రలహరి రివ్యూ

చిత్రలహరి రివ్యూ

చిత్రలహరి రివ్యూ
నటీనటులు : సాయి ధరమ్ తేజ్ . సునీల్ , కల్యాణీ ప్రియదర్శన్ , నివేదా పేతురాజ్
సంగీతం : దేవిశ్రీ ప్రసాద్
నిర్మాతలు : రవిశంకర్ , నవీన్ , మోహన్
దర్శకత్వం : కిషోర్ తిరుమల
రేటింగ్ : 3/ 5
రిలీజ్ డేట్ : 12 ఏప్రిల్ 2019

- Advertisement -

మెగా మేనల్లుడు సాయి ధరమ్ వరుస ప్లాప్ లతో సతమతం అవుతున్న సమయంలో వాటికి భిన్నంగా చేసిన సినిమా ఈ చిత్రలహరి . కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను అలరించేలా రూపొందిందా ? లేదా ? అన్నది తెలియాలంటే కథ లోకి వెళ్లాల్సిందే .

కథ :

విజయ్ కృష్ణ ( సాయి ధరమ్ తేజ్ ) కెరీర్ లో సక్సెస్ కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూసే వ్యక్తి . చేస్తున్న అన్ని ప్రయత్నాలు విఫలం అవుతుండటంతో నీరసించి పోతాడు . అయితే విజయ్ కృష్ణ ఉద్యోగ విషయంలో ఫెయిల్ అవుతున్నప్పటికీ ఎంతో సపోర్ట్ గా ఉంటాడు తండ్రి ( పోసాని ) . రోడ్డు ప్రమాదాల్లో నివారణ కోసం ఓ డివైజ్ ని తయారు చేసి దాని అప్రూవల్ కోసం ప్రయత్నాలు చేస్తున్న సమయంలో లహరి ( కల్యాణీ ప్రియదర్శన్ ) పరిచయం అవుతుంది . ఆ పరిచయం క్రమేణా ప్రేమగా మారుతుంది . అయితే విజయ్ పేరులో ఉన్న విజయం అతడి జీవితంలో లేదని తెలుసుకున్న లహరి అతడు ఓ తాగుబోతు , అబద్దాల కోరు అని భ్రమపడి విజయ్ కు దూరం అవుతుంది . విజయ్ కృష్ణ కెరీర్ లో విజయం సాధించాడా ? లహరి ప్రేమని పొందాడా ? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే .

హైలెట్స్ :

సాయి ధరమ్ తేజ్
పోసాని
వెన్నెల కిషోర్

డ్రా బ్యాక్స్ :

స్లో నెరేషన్

 

నటీనటుల ప్రతిభ :

అపజయాలతో కుంగిపోయే విజయ్ కృష్ణ పాత్రలో సెటిల్స్ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నాడు సాయి ధరమ్ తేజ్ . హీరోయిజానికి పోకుండా క్యారెక్టర్ మాత్రమే ఎలివేట్ అయ్యేలా నటించి మంచి మార్కులు కొట్టేసాడు సాయి . ఈనాటి యువతరానికి ప్రతినిధిగా సాయి ధరమ్ తేజ్ పాత్ర ఉండటంతో యువతని ఈ చిత్రం ఆకట్టుకోవడం ఖాయం . సునీల్ నవ్వులు పూయించాడు . కల్యాణీ ప్రియదర్శన్ తన పాత్ర పరిధి మేరకు బాగానే నటించింది . నివేదా పేతురాజ్ కు ఉన్నంతలో మంచి పాత్రే లభించింది . ఇక వెన్నెల కిషోర్ ఉన్నది కొద్దిసేపే అయినప్పటికీ ప్రేక్షకులను బాగా నవ్వించాడు . పోసాని కీలక పాత్రలో వెన్నెముకగా నిలిచాడు . ఇక మిగిలిన పాత్రల్లో ఆయా నటీనటులు తమతమ పాత్రలకు న్యాయం చేసారు .

సాంకేతిక వర్గం :

దేవిశ్రీ ప్రసాద్ అందించిన పాటల్లో మూడు బాగున్నాయి , అలాగే నేపథ్య సంగీతం తో కూడా అలరించాడు . విజువల్స్ బాగున్నాయి . నిర్మాణ విలువలు బాగున్నాయి . ఇక దర్శకుడు కిషోర్ తిరుమల విషయానికి వస్తే ……. రచయితగా మంచి సంభాషణలు అందించాడు లగే దర్శకుడిగా కూడా సత్తా చాటాడు . అయితే ఇంకొన్ని జాగ్రత్తలు తీసుకొని ఉంటే ఇంకా బాగుండేది .

ఓవరాల్ గా :

చిత్రలహరి యువతని ఆకట్టుకోవడం ఖాయం .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All