Homeటాప్ స్టోరీస్బాలయ్య పుట్టినరోజున చిరు ఆసక్తికర ట్వీట్

బాలయ్య పుట్టినరోజున చిరు ఆసక్తికర ట్వీట్

బాలయ్య పుట్టినరోజున చిరు ఆసక్తికర ట్వీట్
బాలయ్య పుట్టినరోజున చిరు ఆసక్తికర ట్వీట్

నందమూరి బాలకృష్ణ ఈరోజుతో 60వ వసంతంలోకి అడుగుపెడుతున్న సంగతి తెల్సిందే. నాలుగు దశాబ్దాలకు పైగా సాగుతున్న బాలయ్య కెరీర్ లో ఎన్నో ఎత్తుపల్లాలు ఉన్నాయి. లెక్కకు మించి బ్లాక్ బస్టర్లు, సూపర్ హిట్లు అందుకున్న బాలయ్య ప్లాప్ లు, డిజాస్టర్ లు తన ఖాతాలో వేసుకోవాల్సి వచ్చింది. ఏదేమైనా బాలకృష్ణ అంటే ఒక బ్రాండ్. నందమూరి వారసత్వాన్ని ఏళ్లుగా కొనసాగిస్తున్న బాలయ్య ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో నటిస్తున్నారు.

ఈరోజు బాలకృష్ణ పుట్టినరోజు కావడంతో పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువలా వస్తున్నాయి. మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా విషెస్ తెలిపారు. మా బాలకృష్ణకి షష్టి పూర్తి శుభాకాంక్షలు. ఇలాగే ఆయురారోగ్యాలతో వంద వసంతాలు పూర్తి చేసుకోవాలని ఆకాంక్షించారు చిరంజీవి.

- Advertisement -

ఈ మధ్య కేసీఆర్ తో మీటింగ్ వగైరా విషయాల్లో బాలకృష్ణకు చిరంజీవికి మధ్య దూరం పెరిగినట్లు అనిపించింది. తనను మీటింగ్ కు పిలవకపోవడంపై బాలకృష్ణ అలిగారు. దాంతో పాటు కొన్ని ఇంటర్వ్యూలలో ఐ డోంట్ కేర్ అంటూ ఘాటుగానే స్పందించారు. ఈ నేపథ్యంలో వీరిద్దరి మధ్యా మునుపటి సఖ్యత లేదని అనుకున్నారు. కాకపోతే బాలయ్య పుట్టినరోజు సందర్భంగా చిరంజీవి ఆత్మీయంగా ట్వీట్ చేయడంతో అవి టీ కప్పులో తుఫాను అని అర్ధమవుతోంది.

Credit: Twitter

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All