Homeటాప్ స్టోరీస్చిరు త‌న ఫ్రెండ్ సినిమాని పొగిడేశారుగా!

చిరు త‌న ఫ్రెండ్ సినిమాని పొగిడేశారుగా!

Chiru says Rajini's Darbar become a super hit
Chiru says Rajini’s Darbar become a super hit

భాష‌లు వేరైనా ఇత‌ర భాష‌ల న‌టులంటే మెగాస్టార్ చిరంజీవికి ప్ర‌త్యేక అభిమానం. అందులో సూప‌ర్‌స్టార్ ర‌జనీ అంటే మ‌రీ అభిమానిస్తారు. సౌత్ ఇండియ‌న్ సూప‌ర్‌స్టార్‌గా పేరు తెచ్చుకున్న ర‌జనీకాంత్‌కు మెగాస్టార్‌కు మ‌ధ్య గ‌త కొన్నేళ్లుగా మంచి అనుబంధం వుంది. చిరు న‌టించిన చిత్రాల్ని త‌మిళంలో ర‌జ‌నీ చేసి అక్క‌డ సూప‌ర్‌హిట్‌ల‌ని సొంతం చేసుకున్నారు. అత్త‌కు యయుడు అమ్మాయికి మొగుడు, ఘ‌రానా మొగుడు వంటి చిత్రాల్ని ర‌జ‌నీ త‌మిళంలో రీమేక్ చేసిన విష‌యం తెలిసిందే.

ఆదివారం `స‌రిలేరు నీకెవ్వ‌రు` ప్రీరిలీజ్ ఈవెంట్‌లో పాల్గొన్న మెగాస్టార్ చిరంజీవి త‌న మిత్రుడు ర‌జ‌నీకాంత్‌పై వున్న అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సంక్రాంతికి విడుద‌ల‌వుతున్న అన్ని సినిమాలతో పాటు త‌న మిత్రుడు ర‌జ‌నీకాంత్ న‌టిచిన `ద‌ర్బార్‌` కూడా సూప‌ర్‌హిట్ కావాల‌ని ఈ సంద‌ర్భంగా కోరుకోవ‌డం ఆస‌క్తిని రేకెత్తించింది.  సంక్రాంతికి ర‌జ‌నీ న‌టించిన `ద‌ర్బార్‌` విడుద‌ల అవుతున్న విష‌యం తెలిసిందే. స‌రిలేరు నీకెవ్వ‌రు జ‌న‌వ‌రి 11న రిలీజ్ కానుండ‌గా, అల్లు అర్జున్ న‌టించిన `అల వైకుంఠ‌పుర‌ములో` 12న ప్రేక్ష‌కుల ముందుకొస్తోంది.

- Advertisement -

ఈ రెండు చిత్రాల‌కు రెండు రోజుల ముందే జ‌న‌వ‌రి 9న `ద‌ర్బార్‌` తెలుగు, త‌మిళ భాష‌ల్లో విడుద‌ల‌వుతోంది. చాలా ఏళ్ల త‌రువాత ర‌జ‌నీ ఇందులో ప‌వ‌ర్‌ఫుల్ పోలీస్‌గా న‌టిస్తున్నారు. న‌య‌న‌తార క‌థానాయిక‌గా న‌టించిన ఈ చిత్రంలో బాలీవుడ్ న‌టుడు సునీల్‌శెట్టి విల‌న్‌గా న‌టిస్తుండ‌గా, కీల‌క పాత్ర‌లో హీరోయిన్ నివేదా థామ‌స్ క‌నిపించ‌బోతోంది. ఇటీవ‌ల విడుద‌ల చేసిన ట్రైల‌ర్‌లో `ఐయామ్ ఏ బ్యాడ్ కాప్` అంటూ ర‌జ‌నీ చెప్పిన డైలాగ్‌లు, ఆయ‌న మేన‌రిజ‌మ్స్ సినిమాపై ఆస‌క్తిని రేకెత్తిస్తున్నాయి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All