
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఫుల్ ఫ్లో లో ఉన్నాడు. కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమాను చేస్తున్నాడు చిరంజీవి. ఈ చిత్రం ఏప్రిల్ లోనే చిత్రీకరణను పూర్తి చేసుకుని మే 13న విడుదల కానుంది. ఇదిలా ఉంటే చిరంజీవి లూసిఫెర్ రీమేక్ ను, అలాగే తమిళంలో సూపర్ హిట్ సాధించిన వేదాళం రీమేక్ ను చేస్తున్న విషయం తెల్సిందే.
ఈ రెండు ప్రాజెక్ట్స్ కాకుండా చిరంజీవి బాబీ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడని ఎప్పటినుండో ప్రచారం జరుగుతోంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇప్పుడు బయటకు వచ్చింది. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మించనుంది. వారు అధికారికంగా చేసిన ట్వీట్ విషయాన్ని కన్ఫర్మ్ చేసింది. బాబీ, చిరంజీవి కాంబినేషన్ లో సినిమాను తాము నిర్మిస్తున్నట్లు తెలిపారు.
దీంతో ఆచార్య తర్వాత చిరంజీవి లైనప్ కన్ఫర్మ్ అయింది. ముందుగా లూసిఫెర్ రీమేక్, ఆ తర్వాత వేదాళం రీమేక్, ఆ తర్వాత బాబీ సినిమాలను చేయనున్నాడు చిరంజీవి. మరి నాలుగు సినిమాలతో చిరు ఎన్ని హిట్లు అందుకుంటాడు అన్నది ఆసక్తికరంగా మారింది.
Megastar @KChiruTweets garu & @dirbobby with @MythriOfficial ?
— Mythri Movie Makers (@MythriOfficial) February 6, 2021